కాకినాడ ప్రధాన రహదారిలోని దిగుమర్తి వారి వీధిలో డస్ట్‌బిన్లు, రోడ్లపై చెత్త ముంచెత్తింది. ఈ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోంది. జనం ముక్కుమూసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఇటుగా అనేక మంది అధికారులు ఇటుగా వెళ్తుంటారు. వారు కనీసం పట్టించుకోవడం లేదు. దీనివల్ల విష జ్వరాల భయం వెంటాడుతోంది.
– నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ)
● బురద బజారుకెక్కింది!
ఇది నిజమేనండి.. బురద బజారుకొచ్చింది. తుని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన రైతు బజారులో వర్షానికి ఇలా బురదమయంగా మారింది. ఇక్కడకు తునితో పాటు రౌతులపూడి, తుని, కోటనందూరు, తొండంగి మండలాల నుంచి నిత్యం వందలాది మంది రైతులు వచ్చి కూ రగాయలు విక్రయిస్తుంటారు. వినియోగదారులు కూరగాయలు కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్ యార్డు వ్యాపారుల నుంచి చెస్ వసూలు చేస్తున్నా, సమస్యను మాత్రం బురదలో వదిలేసింది. – తుని
● విసిగివేసారేలా..
ఆ రోడ్డుపై ప్రయాణం విసిగివేసారేలా ఉంది. ఏలేశ్వరం ప్రధాన రహదారి మూగజీవాలతో పెద్ద చిక్కే వస్తోంది. రాత్రి వేళలో మరీ ఇబ్బందిగా మారుతోంది. యజమానులు ఆవులను వదిలేయడంతో గుంపులు గుంపుగా రోడ్లపైనే తిష్టవేస్తున్నాయి. వీటిని గమనించని పలువురు వాహనదారులు ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. అధికారులు ఈ సమస్యను పట్టించుకోకుంటే ప్రజల ప్రాణాలకు ముప్పే. – ఏలేశ్వరం


