నిడదవోలు : సీబీఎస్‌ఈ విడుదల చేసిన పదో తరగతి బోర్డు పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ తెలిపారు. పదో తరగతి విద్యార్ధి ఎస్.జైరామ్ 490 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచాడని, కె నందన్ శ్యామ్, ఎన్ లాస్య ప్రియలు 486 మార్కులు, బి. వరసిద్ది వెంకటయశ్వంత్, డీఎస్ శ్రీ హర్షలు 485 మార్కులు, జి.ధన్విశ్రీరెడ్డి 484 మార్కులు, సీహెచ్ నమ్రత్ సాయికిశోర్, జి.జనిత, టి. మానస 482 మార్కులు, టి. బెర్నిస్ దియ 481 మార్కులు సాధించారు. 450 మార్కులకు పైన 130 మంది విద్యార్థులు, 400 మార్కులు పైన 380 మంది విద్యార్థులు సాధించారని రవికుమార్ తెలియజేశారు. విద్యార్థులను, తల్లిదండ్రులను, అధ్యాపక బృందాన్ని శశి విద్యాసంస్థల వైస్ చైర్మన్ లక్ష్మీ సుప్రియ, ప్రిన్సిపాల్ షేక్ షానూర్, అకడమిక్ ఇన్‌చార్జిలు ప్రసంశించారు.


