ప్రత్తిపాడు: తల్లీబిడ్డ అదృశ్యంపై ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. స్థానిక పోలీసుల కథనం మేరకు మండలంలోని ఏలూరు గ్రామానికి చెందిన ఉండ్రు ఆశ తన ఎనిమిది నెలల కుమారుడితో ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు. ఏలూరు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ ఉండ్రు సురేష్‌తో కిర్లంపూడి మండలం వేలంక గ్రామానికి చెందిన ఆశకు నాలుగేళ్ల కిత్రం వివాహమైంది. దీనిపై భర్త ఉండ్రు సురేష్ ఇచ్చిన ఫిర్యాదుపై ప్రత్తిపాడు ఎస్సై ఎస్.అనంతలక్ష్మి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


