గుర్తు తెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వ్యక్తి మృతి

Apr 12 2026 3:48 AM | Updated on Apr 12 2026 3:48 AM

రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం ప్రధాన రైల్వే స్టేషన్‌లోని రెండో నంబర్‌ ప్లాట్‌ఫాంపై సుమారు 60 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని జీఆర్పీ పోలీసులు శనివారం తెలిపారు. అతడు సుమారు 5.2 అడుగుల ఎత్తు కలిగి ఉన్నాడని, అతని వద్ద మావూరి అప్పారావు, తండ్రి వీరన్న అనే పేరుతో ఆసుపత్రి కార్డు ఉందన్నారు. దీనిపై కేసు నమోదు చేసి, మృత దేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు 94407 79249 ,0883 2442821 నంబర్లకు సమాచారం ఇవ్వాలని హెడ్‌ కానిస్టేబుల్‌ గంగరాజు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement