ఆలయానికి రూ.6 లక్షల విరాళం
దేవరపల్లి: గౌరీపట్నంలోని గౌరీ సమేత ఉమారామలింగేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి స్థానికులు కొర్లపాటి గాంధీ కుమారుడు సుబ్రహ్మణ్యం, అరుణ దంపతులు రూ.6 లక్షల విరాళం అందజేశారు.
రేపటి నుంచి
పశు ఆరోగ్య శిబిరాలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పశువుల ఆరోగ్య పరిరక్షణ, ఉత్పాదకత పెంపు, వ్యాధుల నివారణ లక్ష్యంగా సోమవారం నుంచి 31 వరకు జిల్లాలోని పశుపాలక రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్టు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ వై. మేఘస్వరూప్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ‘‘పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్‌ని శనివారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ శిబిరాల్లో పాలిచ్చే పశువులు, దూడలు, గొర్రెలు, మేకలకు డీ వార్మింగ్, మశూచి టీకాలు, కోళ్లకు, బాతులకు టీకాలు వేయడం, ఉచిత పశు వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఉదయం 8 గంటల నుంచి పశు ఆరోగ్య శిబిరాలు ప్రారంభమవుతాయన్నారు. సీపీఓ ఎల్.అప్పలకొండ, ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ కె. సత్యనారాయణ పాల్గొన్నారు.
అప్పనపల్లి బాలాజీకి
రూ.8.16 లక్షల ఆదాయం
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామికి శనివారం రికార్డు సంఖ్యలో ఆదాయం వచ్చింది. సంక్రాంతి పండగ నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శ్రీదేవి, భూదేవి సమేతుడైన బాల బాలాజీ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ.8,16,073 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 24 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 8,500 మంది స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారని చెప్పారు. నిత్య అన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.90,397 విరాళాలుగా అందించారన్నారు. మండపేటకు చెందిన మాకే ఏసుదాసు వారి కుటుంబ సభ్యులు స్వామి వారి అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.50,049 విరాళంగా అందించారు. వారికి ఈఓ స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఏర్పాట్లను ఆలయ వంశపారం పర్య ధర్మకర్త మొల్లేటి చక్రపాణి పర్యవేక్షించారు.
మహాలక్ష్మి ఆలయ నిర్మాణానికి
రూ.28.49 లక్షల విరాళాలు
పి.గన్నవరం: మండలంలోని ఎల్.గన్నవరం గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్మిర్మాణానికి భక్తులు శనివారం రూ.28.49 లక్షల మేర విరాళాలను ఆలయ కమిటీకి అందజేశారు. గ్రామానికి చెందిన చిట్టాల ఆదినారాయణమూర్తి రూ.5,67,999, చిట్టాల పాండు రంగారావు కుటుంబ సభ్యులు రూ.5,00,116, దివంగత యర్రంశెట్టి కొండలరావు కుమారులు, కుమార్తెలు, మనుమలు కలిసి రూ.4,78,116, నల్లా ఆదినారాయణమూర్తి రూ.3,00,999, అల్లాడ భాస్కరరావు రూ.3,00,006, అల్లాడ మార్తాండ కుటుంబ సభ్యులు రూ.3 లక్షలు, డొక్కా జగ్గారావు కుటుంబ సభ్యులు రూ.1,00,800, డొక్కా చిట్టియ్య కుమారులు రూ.1,00,800, యర్రంశెట్టి నవీన్‌కుమార్ రూ.1,00,116, మంత రమణారావు కుటుంబ సభ్యులు రూ.1,16,000, చిట్టాల సత్యనారాయణమూర్తి రూ.1,00,889, చిట్టాల చిట్టిబాబు రూ.51,116 ఆలయ కమిటీకి అందజేశారు. గ్రామస్తులు రూ.10 వేల వంతున విరాళాలను అందజేశారు.
ఆలయానికి రూ.6 లక్షల విరాళం
ఆలయానికి రూ.6 లక్షల విరాళం


