కోరుకొండ నారసింహుని క్షేత్రానికి భక్తుల తాకిడి
కోరుకొండ: కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రానికి శనివారం భక్తుల రద్దీ ఏర్పడింది. సంక్రాంతి ముక్కనుమ పండగ సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. దిగువనున్న స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. భక్తులు తొలుత స్వామివారి పాదాలచెంత పూజలు చేసిన అనంతరం కొండపైన కొలువుదీరిన స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి అన్న సమారాధన కేంద్రం వద్ద భక్తులు బారులు తీరారు. రద్దీకారణంగా ఆహార పదార్థాలు సరిపడ లేదు. తిరిగి తయారు చేయడానికి ఆలస్యమయ్యింది. అలాగే భక్తులకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులేర్పడ్డాయి. మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడంతో భక్తులు ఇబ్బందిపడ్డారు. ఆలయ ప్రాంగణంలో తిని పడేసిన ఆకులు, ఆహార పదార్థాల కారణంగా దుర్వాస నవచ్చింది. దీంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. దేవస్థానాన్ని దత్తత తీసుకున్న అన్నవరం శ్రీసత్యనారాయణ స్వామి దేవస్థానానికి చెందిన ఉద్యోగులు స్థానికంగా లేకపోవడం, ముక్కనుమకు భక్తుల తాకిడిని అంచనా వేయలేకపోవడంతో సమస్యలు తలెత్తాయి.
కోరుకొండ నారసింహుని క్షేత్రానికి భక్తుల తాకిడి


