విలువలతో కూడిన విద్య ‘శ్రీప్రకాష్’ లక్ష్యం
పెద్దాపురం (సామర్లకోట): విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించాలనే లక్ష్యంతో శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాలలను ఏర్పాటు చేశామని శ్రీప్రకాష్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కె.కేశవరావు అన్నారు. పెద్దాపురం రామారావుపేటలోని శ్రీప్రకాష్ సినర్జీ విద్యా సంస్థ 18వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు ఆటలు, యోగాసనాలపై ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు కూడా శ్రద్ధ చూపాలన్నారు. విద్యా సంస్థల డైరెక్టర్ సీహెచ్ విజయప్రకాష్ మాట్లాడుతూ పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. విద్యార్థులు ప్రదర్శించిన కర్ర సాము, రోప్ స్కిప్పింగ్‌లతో పాటు మాతృదేవోభవ, మిత్రదేవోభవ అనే విషయాల ద్వారా ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో చైర్మన్ సీహెచ్ నరసింహారావు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
విలువలతో కూడిన విద్య ‘శ్రీప్రకాష్’ లక్ష్యం


