
ఈ పని వృథాయే..
కాలువ తవ్వకాల పనులు చేయటం బాగానే ఉన్నా, తవ్విన మట్టిని గట్టుపై నుంచి తొలగించకపోతే చేసిన పని వృథా అవుతుంది. వర్షాలకు ఆ మట్టి కరిగి తిరిగి కాలువలోకే వచ్చేస్తుంది.
– పంత పోలయ్య, రైతు,
అన్నవరప్పాడు, పెరవలి మండలం
నీరు వదిలే సమయంలో పనులా?
కాలువలకు నీరు వదిలే సమయంలో కాలువ తవ్వకాలు చేపట్టారు. ప్రస్తుతం మాకు వచ్చే గరప కాలువ పనులు చేస్తున్నారు. దీనివలన సాగునీరు నిలిచిపోయి ఖరీఫ్ పనులు ఆలస్యమవుతున్నాయి. ఇప్పటికే ఆకుమడులు వేయాల్సి ఉండగా ఆ పనులు చేపట్టలేకపోయాం.
– పిల్లా శ్రీనివాస్, రైతు, కొత్తపల్లి అగ్రహారం
ఆరిన వెంటనే మట్టి తొలగిస్తాం
పేకేరు, గరప కాలువల శివార్లలో పూడికల తొలగింపు పనులు జరుగుతున్నాయి. పేకేరు కాలువకు శనివారం, గరప కాలువకు ఆదివారం నీరు వదులుతాం. ఆరిన వెంటనే మట్టి తొలగించే పనులు చేపడతాం.
– ఎన్.బాలమురళీకృష్ణ, ఏఈ, ఇరిగేషన్, పెరవలి

ఈ పని వృథాయే..

ఈ పని వృథాయే..

ఈ పని వృథాయే..

ఈ పని వృథాయే..