
పదవులు పొందిన వారికి అభినందనలు
బిక్కవోలు: వైఎస్సార్ సీపీలోని వివిధ విభాగాల్లో పదవులు పొందిన మండల నాయకులను మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అభినందించారు. ఈ మేరకు గురువారం అనపర్తిలోని పార్టీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ అనపర్తి మండల యువజన విభాగం అధ్యక్షుడిగా గొలుగూరి సురేంద్రరెడ్డి, మండల పంచాయతీ రాజ్ విభాగం కార్యదర్శిగా సత్తి సుబ్బారెడ్డి, మండల విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా సబ్బెళ్ల నాగిరెడ్డిని నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలోని ఏఎంసీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, మండల కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.