16 సమ్మర్ వీక్లీ స్పెషల్ రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: వేసవికాలం ప్రయాణికుల రద్దీని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా మీదుగా 16 వీక్లీ సమ్మర్ స్పెషల్ రైళ్లు ఏర్పాటు చేస్తూ రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. 07325 హుబ్లీ– కటీయార్ ప్రతి బుధవారం నడిచే ఈ రైలు ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. 07326 కటియార్–హుబ్లీ ప్రతి శనివారం నడిచే ఈ రైలు 12వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. 06559 ఎస్‌ఎంవీటీ బెంగళూరు– నారంగి ప్రతీ మంగళవారం నడిచే ఈ రైలు ఈ నెల 29వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. 06560 నారంగి– ఎస్‌ఎంవీటీ బెంగళూరు ప్రతీ శనివారం నడిచే రైలు ఈ నెల 12వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో ఆగనున్నాయని ప్రయాణికులు సద్వినియోగం వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వేగంగా అర్జీల పరిష్కారం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రెవెన్యూ పరంగా పీజీఆర్‌ఎస్‌లో 6,765 అర్జీలు పరిష్కారం కోసం రాగా 6,226 పరిష్కరించామని కలెక్టర్ పి. ప్రశాంతి తెలియజేశారు. మంగళవారం అమరావతి నుంచి సీసీఎల్‌ఏ కమిషనర్ జి.జయలక్ష్మి కలెక్టర్లతో పీజీఆర్‌ఎస్, వాటర్ ట్యాక్స్, భూముల క్రమబద్ధీకరణ అంశాలపై వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరాలు తెలియజేస్తూ భూముల క్రమబద్ధీకరణ కోసం ఇప్పటి వరకు 278 దరఖాస్తులు రాగా పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా ల్యాండ్ సర్వే అధికారి బి.లక్ష్మీనారాయణ, డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాస్, పాల్గొన్నారు


