మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గం
రాజమహేంద్రవరం సిటీ: పేదలకు వైద్య విద్యను అందించే లక్ష్యంతో జగనన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుడితే.. చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా వాటిని ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. భోగి పండగ సందర్భంగా ఆయన నివాసం వద్ద బుధవారం వేడుకలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, కార్యకర్తలతో కలిసి భోగిమంటను వెలిగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో ప్రతులను భోగిమంటలో వేసి దహనం చేశారు.


