పోటీల్లో మేటి.. సత్తా చాటి | - | Sakshi
Sakshi News home page

పోటీల్లో మేటి.. సత్తా చాటి

Oct 3 2026 12:14 AM | Updated on Oct 3 2026 12:14 AM

మలికిపురం: గత నెల 30న రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కాలేజీలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో బట్టేలంక ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అమలదాసు దివ్య డిస్కస్‌త్రోలో, నల్లి శాంతికిరణ్‌ షార్ట్‌ఫుట్‌లో జిల్లా స్థాయిలో బంగారు పతకాలు సాధించి రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యారు. వీరిని పలువురు అభినందించారు.

అండర్‌–19 క్రికెట్‌ పోటీలకు..

రాజోలు: అండర్‌–19 క్రికెట్‌ పోటీలకు రాజోలుకు చెందిన నల్లి ఆదర్స్‌ ఎంపికయ్యాడు. చిత్తూరు జిల్లా నగరిలో జరిగే పోటీల్లో ఆదర్స్‌ పాల్గొంటాడని కోచ్‌ మట్టా సత్తిబాబు తెలిపారు. ఈ నెల 1న కాకినాడలో జరిగిన అండర్‌–16 క్రికెట్‌ పోటీల్లో ప్రతిభ చూపాడన్నారు. ఆదర్స్‌ తండ్రి ఆనందరావు రాజోలు కోర్టులో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా, తల్లి నర్సుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఉషు రాష్ట్ర స్థాయి పోటీలకు..

కరప: ఎస్‌జీఎఫ్‌ ఉషు రాష్ట్ర స్థాయి పోటీలకు వేళంగి నర్సు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని డీజీవీ లక్ష్మీప్రియ ఎంపికై నట్టు ఆ పాఠశాల హెచ్‌ఎం ఆర్‌.త్రిమూర్తులు శుక్రవారం తెలిపారు. కాకినాడ డీఎస్‌ఈ గ్రౌండ్‌లో జరిగిన ఉషు అండర్‌–17 విభాగ పోటీల్లో ఆమె ప్రతిభ చూపి రాష్ట్ర పోటీలకు ఎంపికై ందన్నారు.

స్కూల్‌ గేమ్స్‌లో..

వీఆర్‌పురం: స్కూల్‌ గేమ్స్‌లో సోములగూడెం ఆశ్రమ పాఠశాల బాలికలు నాలుగు బంగారు పతకాలు సాధించారు. ఇటీవల కాకినాడలో 2026–27 స్కూల్‌ గేమ్స్‌ ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలు జరిగాయి. ఇందులో కుస్తీ అండర్‌–17లో 40 కిలోల విభాగంలో పదో తరగతి విద్యార్థిని బి.సరిత, 43 కిలోల విభాగంలో పదో తరగతి విద్యార్థిని బి.శ్రావణి బంగారు పతకాలు సాధించారు. అండర్‌–14 విభాగంలో 30 కిలోల్లో 8వ తరగతి విద్యార్థిని కె.దివ్య, 42 కేజీల్లో 9వ తరగతి విద్యార్థిని కె.సరిత బంగారు పతకాలు దక్కించుకున్నారు. వీరు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఫుట్‌బాల్‌ పోటీల్లో 9వ తరగతి విద్యార్థిని కె.సరిత ప్రతిభచాటి, రాష్ట్ర స్థాయికి ఎంపికై ంది.

నేడు ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా స్థాయి ఎంపికలు

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌–14, 17 ఆధ్వర్యంలో శనివారం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో పలు క్రీడాంశాల్లో జిల్లా స్థాయి ఎంపికలు ఉమ్మడి జిల్లా పరిధిలో నిర్వహిస్తున్నట్లు సంఘ కార్యదర్శి పి.శ్రీనివాస్‌ శుక్రవారం తెలిపారు. అండర్‌–14, 17 బాలుర హ్యాండ్‌బాల్‌, అండర్‌–14 బాలురు, బాలికల బ్యాడ్మింటన్‌, అండర్‌–17 బాలురు, బాలికల ఫుట్‌బాల్‌ ఎంపికలు జరుగుతాయన్నారు. అమలాపురంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో మల్కంబ్‌ అండర్‌–14, 17, 19 బాలురు, బాలికల విభాగంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

రేపు సెపక్‌తక్రాకు..

దేవరపల్లి: సెపక్‌తక్రా జిల్లా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 4న మధ్యాహ్నం 2 గంటలకు దేవరపల్లిలోని అంబటి సత్యనారాయణరావు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ క్రీడా మైదానంలో సెపక్‌తక్రా సీనియర్‌ బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక పోటీలు ఉంటాయని చిన్నాయగూడెం వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement