అమ్మో.. పులి | - | Sakshi
Sakshi News home page

అమ్మో.. పులి

Oct 3 2026 12:14 AM | Updated on Oct 3 2026 12:14 AM

● పెద్దపులి సమస్యపై గిరిజనుల గగ్గోలు

● భీతిల్లుతున్న గిరిజన గ్రామాలు

● అటవీ అధికారుల అనాలోచిత

నిర్ణయంతో ఇబ్బందులు

రంపచోడవరం: మన్యంలో పెద్దపులి గిరిజనులకు పెద్ద సమస్యగా మారింది. ఎప్పుడు ఎక్కడ ఉంటుందో, ఏం జరుగుతుందో అనే ఆందోళన ఆదివాసీలను వెంటాడుతూనే ఉంది. నిన్న మొన్నటి వరకు రాజవొమ్మంగి పరిసర అటవీ ప్రాంతంలో ఉన్న పెద్దపులి, గంగవరం అటవీ ప్రాంతం నుంచి రంపచోడవరం మీదుగా దేవీపట్నం మండలంలోకి చేరింది. కొండమొదలు గ్రామ సమీపాన పాపికొండలు నేషనల్‌ పార్కు పరిధిలో వదిలిన మరుసటి రోజు నుంచి వెనుదిరిగి రామన్నవలస, సున్నంపాడు మీదుగా రంప, పెద్దకొండ గ్రామానికి చేరుకొంది. అక్కడ నుంచి రాజవొమ్మంగి, ఏలేరు ప్రాజెక్టు సమీపాన సంచరించింది. పెద్దపులి ప్రస్తుతం తన పరిధిలోని ఏర్పాటు చేసుకొంది. ఇప్పటి అనేక పశువులపై దాడి చేసి హతమార్చింది. పాపికొండల్లో వదిపెట్టిన పులి తమ గ్రామాల సమీపానికి వచ్చి పెద్ద సమస్యగా మారిందని గిరిజనులు గగ్గోలు పెడుతున్నారు.

సాయంత్రం ఆరు గంటల వరకు..

ఉభయగోదావరి జిల్లాల్లోకి పులి ప్రవేశించి ఐదారు నెలలు దాటింది. వరదలు తగ్గిన తరువాత గోదావరి ఈదుకుంటూ దేవీపట్నం ముంపు ప్రాంతానికి పెద్ద పులి చేరుకొంది. తరువాత అక్కడ నుంచి రాజవొమ్మంగి ప్రాంతానికి వెళ్లింది. అక్కడ పుశువులపై దాడి చేసింది. పులి దాడిలో తమ పశు సంపద నాశనమైయ్యే పరిస్థితి వస్తోందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పెద్దపులి నాగళ్లపల్లి ప్రాంతంలో ఉంది. వరద నీరు ఉండడంతో దండంగి నుంచి పోశమ్మగండి రోడ్డు, పోలవరం పవర్‌ ప్రాజెక్టు మీదుగా పురుషోత్తపట్నం వెళ్లే రోడ్డు వైపు వెళ్లే అవకాశం లేదు. గతంలో పులి కదలికలపై ప్రత్యేక బృందాలు పనిచేసేవి. పులి కదలికలను ఎప్పటికప్పుడు రికార్డు చేసి, సమీప గ్రామాల వారిని అప్రమత్తం చేసేవారు. తాజాగా పెద్ద పులి దేవీపట్నం మండలం నాగళ్లపల్లి–గొందూరు మధ్య ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. అయితే పులి కదలికపై ఆయా సెక్షన్‌ల అటవీ అధికారులు, సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు పులి కదలికలపై ట్రాకర్‌ ద్వారా గుర్తించి స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. ఆరు గంటల తరువాత పులి కదలికలపై ఎటువంటి సమాచారం ప్రజలకు తెలిసే అవకాశం లేదు. గతంలో గంగంపాలెం వద్ద ఆరు లేగ దూడలను పెద్దపులి హతమార్చింది. ప్రస్తుతం పులి దాడిలో ఎన్ని పశువులు హతమవుతాయో అనే ఆందోళన గిరిజనులు వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క నేషనల్‌ పార్కు పరిధిలో ఉన్న గిరిజన గ్రామాల వారు తమను గ్రామాల నుంచి వెళ్లగొట్టేందుకు పులిని వదిలిపెట్టారని ఆరోపిస్తున్నారు. అటవీ అధికారులు జంతువులను వదిలిపెట్టిన గ్రామాలను ఖాళీ చేసే ప్రసక్తే లేదని చెబుతున్నారు. గిరిజనుల సంక్షేమం చూడాల్సిన ఐటీడీఏ అధికారులు నేషనల్‌ పార్కు వలన గిరిజనులకు కలిగి నష్టంపై కనీసం అవగాహన కల్పించడం లేదు. వారికి అండగా నిలిచేందుకు ప్రయత్నం చేయకపోవడం శోచనీయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement