మహాత్ముని సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

మహాత్ముని సేవలు చిరస్మరణీయం

Oct 3 2026 12:14 AM | Updated on Oct 3 2026 12:14 AM

అమలాపురంరూరల్‌: జాతిపిత మహాత్మా గాంధీ సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి అధికారులతో కలసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నేటి విద్యార్థులు, యువతరం బాపూజీ ఆదర్శాలను స్వీకరించి, దేశ సంక్షేమానికి దోహదపడాలని కోరారు. గాంధీజీ విద్య, పారిశుధ్యం, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. స్వాతంత్య్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస అనే మార్గాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, స్వచ్ఛత సాధన దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. బాపూ ఆశయాలను స్మరిస్తూ, ఆయన చూపిన బాటలో నడవడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ వి.సుబ్బారావు, అముడా చైర్మన్‌ అల్లాడ స్వామి నాయుడు, ఏవో కె.నాగలక్ష్మమ్మ, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని మహాత్మునికి అంజలి ఘటించారు.

లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఆశయాలు,

ఆదర్శాలు స్ఫూర్తిదాయకం

భారత మాజీ ప్రధాన మంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి జరుపుకోవడం చాలా సంతోషదాయకమని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ తెలిపారు. ఈదరపల్లిలో హనుమాన్‌ థియేటర్‌ వద్ద పట్టణ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం కమ్యూనిటీ హాల్‌లో శుక్రవారం లాల్‌ బహదూర్‌ శాస్త్రి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement