మాజీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్
కె.గంగవరం: బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆడుతున్నవి ఎన్నికల డ్రామాలని మాజీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ విమర్శించారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ బాబుకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే తన మద్దతుతో కేంద్రంలో కొనసాగుతున్న ప్రభుత్వాన్ని ఒప్పించి రాజ్యాంగ సవరణ చేయించాలని డిమాండ్ చేశారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల జీవో కోర్టుల్లో నిలబడదని తెలిసే.. స్థానిక ఎన్నికల సమయంలో బీసీలను మభ్యపెట్టి ఓట్లు పొందాలని చంద్రబాబు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల కోసం 1983లో అప్పటి సీఎం ఎన్టీఆర్, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నం చేసినా కోర్టులో నిలవలేదన్నారు. కోర్టు అంగీకరించకపోయినా జగన్ బీసీలకు ఎక్కువ అవకాశాలు అందించి ప్రజాప్రాతినిధ్యం అందజేశారని ఈ సందర్భంగా లెక్కలతో సహా వివరించారు. హైకోర్టులో కొట్టివేసిన ఈ అంశం సుప్రీంకోర్టులోనూ నిలవదని తెలిసి కూడా చంద్రబాబు ప్రభుత్వం బీసీలను మోసం చేయడానికి ఎన్నికల డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు.
కోనసీమకు 67
స్వచ్ఛాంధ్ర అవార్డులు: కలెక్టర్
అమలాపురం రూరల్: స్వచ్ఛతా రంగంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా సత్తా చాటిందని, జిల్లాకు ఏకంగా 67 స్వచ్ఛాంధ్ర అవార్డులు లభించడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావులతో కలసి పురస్కారాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అముడా చైర్మన్ ఎ.స్వామినాయుడు, డీఆర్‌వో వి.సుబ్బారావు, ఆర్‌డీవో సరళాదేవి, మున్సిపల్ కమిషనర్లు నిర్మల్ కుమార్, రామ్‌రాజ్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


