అల్లవరం: దేవగుప్తం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఉచ్చల భానుప్రసాద్, తాడి ఆర్య రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ గురువారం ఈ విషయం తెలిపారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో బుధవారం జరిగిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఎస్‌జీఎఫ్ అథ్లెటిక్స్ హైజంప్ పోటీల్లో భానుప్రసాద్ 1.62 మీటర్ల ఎత్తు క్లియర్ చేసి మొదటి స్థానం సాధించాడని పేర్కొన్నారు. అలాగే, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఆర్య మొదటి స్థానం కై వసం చేసుకుని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. క్రీడాకారులను ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్, ఉపాధ్యాయులు అభినందించారు.


