ప్రాణాలకు తెగించి సేవలందించాం | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలకు తెగించి సేవలందించాం

Oct 2 2026 12:28 AM | Updated on Oct 2 2026 12:28 AM

వరదలు, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి మరీ ప్రజలకు సేవలందించాం. బాధితులకు అండగా నిలిచాం. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మరీ పింఛన్లు అందించాం. అటువంటి మమ్మల్ని కాదని ఇప్పుడు వేలకు వేలు చెల్లించి సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లెయెన్సర్లను నియమించాలనే కూటమి ప్రభుత్వ విధానం సరైంది కాదు. దీని ద్వారా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. సేవా దృక్పథంతో పని చేసిన వలంటీర్లను విస్మరించడం న్యాయం కాదు.

– పెయ్యల శ్రీరామ్‌, మాజీ వలంటీర్‌, ముమ్మిడివరం

మా ఉసురు తగలక మానదు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పడమే కాకుండా రూ.10 వేలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పి అధికారం చేపట్టాక మమ్మల్ని దగా చేశారు. అధికారంలోకి వస్తే తమ వ్యవస్థను కొనసాగిస్తామన్న హామీ ఏమైంది?. రూ.10 వేలు ఇస్తామన్న మాట వట్టిదేనని మాకు అర్థమైంది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మాకు ఇచ్చిన రూ.5 వేల గౌరవ వేతనంతో మాకు కేటాయించిన ఇళ్ల కుటుంబాలకు గౌరవ ప్రదంగా సేవలందించాం. మా ఉసురు కూటమి ప్రభుత్వానికి తగలక మానదు.

– రెడ్డి సతీష్‌కుమార్‌, మాజీ వలంటీర్‌, అమలాపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement