వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం

Oct 2 2026 12:28 AM | Updated on Oct 2 2026 12:28 AM

అమలాపురం రూరల్‌: జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ అన్నారు. స్థానికంగా రైతులు పండిస్తున్న పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను ప్రాసెసింగ్‌ చేసి విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ద్వారా రైతులకు మెరుగైన మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించవచ్చన్నారు. గురువారం అమలాపురం రూరల్‌ మండలం సమనస గ్రామ పంచాయతీ వద్ద సత్యదేవ్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన అమ్వి ఫుడ్స్‌ పరిశ్రమను కలెక్టర్‌ సందర్శించారు. పరిశ్రమలోని వివిధ విభాగాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలపై పరిశ్రమ ప్రతినిధులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీఆర్‌డీఏ పీడీ రాంబాబు, తహసీల్దార్‌ దివాకర్‌, మాజీ సర్పంచ్‌ ఎన్‌.ఉదయబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమ్వి ఫుడ్స్‌ ఉత్పత్తి పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు.

విద్యాభ్యాసంపై సమగ్రంగా అంచనా

విద్యార్థుల మానసిక ఆరోగ్యం, విద్యాభ్యాసంపై సమగ్రంగా అంచనా వేసేందుకు చేపట్టనున్న సర్వేను పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య శాఖ, విపాసన మిత్ర కోఆర్డినేటర్లు కిమ్స్‌ సైకియాట్రిస్ట్‌ అధికారులతో ఆయన సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థుల మానసిక క్షేమం వారి చదువు, ప్రవర్తన, వ్యక్తిత్వ వికాసం, భవిష్యత్‌ అభివృద్ధికి ఎంతో కీలకమన్నారు. వారి మానసిక, విద్యాపరమైన అంశాలను ముందే గుర్తించి అవసరమైన సహాయం, మార్గదర్శకత్వం అందించేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడేలా చూడాలని సూచించారు. డీసీహెచ్‌ఎస్‌ కె.కార్తీక్‌, మిత్ర కోఆర్డినేటర్‌ టి.ప్రహ్లాద్‌, మిత్ర కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement