బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం కేవలం జీవోతో మోసం చేసింది. చట్టం చేయకుండా జీవో ఇస్తే చెల్లదని తెలిసి కూడా కావాలనే డ్రామా ఆడింది. ఇది బీసీ సమాజాన్ని తీవ్రంగా అవమానించడమే.
– మట్టపర్తి నాగేంద్ర, వైఎస్సార్‌సీపీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు
ఇది ఎన్నికల నాటకం
స్థానిక సంస్థల ఎన్నికల ముందు బీసీల ఓట్ల కోసం చంద్రబాబు కొత్త నాటకం మొదలుపెట్టారు. హైకోర్టు తీర్పు వారికి చెంపపెట్టు. ఓట్ల కోసం కాకుండా బీసీల సంక్షేమానికి, రాజ్యాధికారం కల్పించేలా ప్రభుత్వం చూడాలి తప్ప.. ఇలా మోసం చేయకూడదు.
– మార్గాని గంగాధర్, మాజీ ఎంపీపీ, కొత్తపేట
కేంద్రాన్ని ఒప్పించి చట్టం చేయండి
బీసీల మీద చంద్రబాబుకు ప్రేమ ఉంటే 34 శాతం రిజర్వేషన్‌పై కేంద్రాన్ని ఒప్పించండి. పార్లమెంట్‌లో చట్టం చేయండి. కేంద్ర ప్రభుత్వం మీ మీదనే ఆధారపడి ఉంది కదా! చట్టం చేస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది.
– కందుల విజయకుమార్,
యాదవ సంఘం నాయకుడు, గొల్లపాలెం, మలికిపురం మండలం


