ఫ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రజలకు వారి గడప వద్దనే సంక్షేమ పథకాలను అందించింది.
ఫ అప్పట్లో జిల్లావ్యాప్తంగా సుమారు 9,581 మంది వలంటీర్లు పని చేసేవారు. ముఖ్యంగా గోదావరికి భారీ వరదలు వచ్చిన 2022 జూలై, ఆగస్టు నెలల్లో లంక గ్రామాల్లోని ప్రజలకు ఆహారం, తాగునీరు, నిత్యావసరాలు చేరవేయడంలో విశేష సేవలందించారు. ఉదయం, మధ్యాహ్నం ఆహారం తయారు చేసి, ముంపు బాధితులకు అందించేవారు. అలాగే, ఏటిగట్ల వద్ద పరిస్థితులను గమనిస్తూ అధికారులకు సమాచారం అందించేవారు. అత్యవసర పరిస్థితుల్లో వరద బాధితులకు అందుబాటులో ఉండేవారు.
ఫ గ్రామ, వార్డు స్థాయిల్లో పింఛన్ల పంపిణీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం, అర్హుల గుర్తింపు, అవసరమైన ధ్రువపత్రాలకు దరఖాస్తుల ప్రక్రియలో సహకారం వంటి ఎన్నో సేవలు అందించేవారు.
ఫ కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి మరీ బాధితులకు మందులు, నిత్యావసరాలు చేరవేయడం ద్వారా ప్రజల మన్ననలు అందుకున్నారు.


