తాళ్లరేవు: ప్రముఖ పర్యాటక ప్రదేశమైన కోరింగ అభయారణ్యంలోని కమ్యూనిటీ బేస్‌డ్ ఎకో టూరిజం (సీబీఈటీ) – చొల్లంగికి బెస్ట్ యూనిక్ ప్రాజెక్టు అవార్డు లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం రాష్ట్ర స్థాయి వేడుకల్లో భాగంగా రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ఈ అవార్డును జిల్లా అటవీ శాఖ అధికారి ఎంవీ ప్రసాదరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ, సీబీఈటీలో పని చేస్తున్న ఎగ్జిక్యూటివ్, ఎకో–టూరిజం సిబ్బంది కృషి ఫలితంగానే ఈ అవార్డు దక్కిందని అన్నారు. కోరింగ అభయారణ్యాన్ని ప్లాస్టిక్ రహిత టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు ఫారెస్ట్ రేంజర్ ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాద్ తెలిపారు.


