ఉప్పలగుప్తం: వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా విలసవిల్లికి చెందిన సలాది సతీష్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయని సతీష్ శనివారం విలేకర్లకు తెలిపారు. అమలాపురం నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్‌ను, నియోజకవర్గ పరిశీలకుడు కటకంశెట్టి ఆదిత్యలను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. సతీష్‌ను డాక్టర్ శ్రీకాంత్, ఆదిత్యలు దుశ్శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన రీజినల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, పార్లమెంట్ కోఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, అసెంబ్లీ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్‌లకు సతీష్ కృతజ్ఞతలు తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు బద్రి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.


