రావులపాలెం: జిల్లాలో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు వైఎస్సార్ సీపీ బలోపేతానికి పాటుపడాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి సూచించారు. రావులపాలెం వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయంలో శనివారం రాష్ట్ర కార్యదర్శులతో (పార్లమెంట్) ఆయన సమావేశమయ్యారు. పార్టీ డిజిటలైజేషన్ కార్యక్రమాలు, వెరిఫికేషన్ ప్రక్రియలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా చేపట్టే అంశాలపై చర్చించారు. పార్టీ శ్రేణులు గ్రామస్థాయి నుంచి మరింత సమన్వయంతో పని చేయాలని జగ్గిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తకు పార్టీ కార్యక్రమాలు చేరేలా ఆధునిక సాంకేతిక విధానాలను వినియోగించాలని సూచించారు. అలాగే జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో వైఎస్సార్ సీపీ ఎల్లప్పుడూ ముందుంటుందని చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి రాష్ట్ర నాయకత్వం సూచించిన విధంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా పనిచేయాలన్నారు. అలాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై రాష్ట్ర కార్యదర్శులు విప్పత్తి వేణుగోపాల్, చింతలపాటి శ్రీనివాసరాజు, కర్రి నాగిరెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాసరావు, కర్రి పాపారాయుడు, పాటి శివకుమార్, వంటెద్దు వెంకయ్య నాయుడు, కటకంశెట్టి ఆదిత్య, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు చీకట్ల కిశోర్ తదితరులతో చర్చించారు. కార్యక్రమంలో అముడా మాజీ చైర్మన్, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు గొల్లపల్లి డేవిడ్‌రాజు, కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధరరావు, పార్టీ మండల కన్వీనర్లు బొక్కా కరుణాకరం, తమ్మన శ్రీను, మాజీ సర్పంచ్ కర్రి గోవిందకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి


