సాక్షి, అమలాపురం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా కమిటీలలో జిల్లాకు చెందిన పలువురికి అవకాశం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీరిని నియమించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అఫిలెటెడ్ వింగ్ కమ్యూనిటీస్‌లో రాష్ట్ర బీసీ సెల్ జనరల్ సెక్రటరీలుగా మేడిశెట్టి దుర్గారావు(మండపేట), కుడుపూడి రాంబాబు(మండపేట), రాష్ట్ర ఎస్సీసెల్ జనరల్ సెక్రటరీగా వల్లూరి రామకృష్ణ (మండపేట), రాష్ట్ర ఎస్సీసెల్ జాయింట్ సెక్రటరీగా మాత మురళి (రామచంద్రపురం), రాష్ట్ర యూత్ వింగ్ సెక్రటరీగా సలాది సత్యనారాయణమూర్తి (అమలాపురం)లను నియమించారు. ఆర్‌టీఐ వింగ్‌జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొల్లు త్రినాథవర్మ (అమలాపురం), మండల పార్టీ కమిటీ కాట్రేనికోన మండల జనరల్ సెక్రటరీగా మల్లాడి వీరబాబ్జి (ముమ్మిడివరం) నియమితులయ్యారు.
జీవామృతంతో
మెరుగైన ఉత్పాదకత ˘
అమలాపురం రూరల్: స్పైరులిన ఫార్మింగ్ ద్వారా జిల్లాలో ఆక్వా, పాడి పరిశ్రమ, సేంద్రియ వ్యవసాయంలో జీవామృతం తయారీ ద్వారా మెరుగైన ఉత్పాదకతకు యోచిస్తున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, మత్స్య, పశు సంవర్ధనం విభాగాల అధికారులతో మామిడికుదురు మండలం మానేపల్లిలో స్పైరులిన ఫార్మింగ్ నిర్వహిస్తున్న కేశవతో సాగు ఉపయోగాలపై సమగ్రంగా చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉత్పత్తులను ల్యాబ్‌కు పంపి పోషక విలువలను నిర్ధారించాలని మత్స్య శాఖ ఏడీ వర్ధన్‌ను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎంవీ రామారావు, జిల్లా పశ్చిమ వర్తక శాఖ అధికారి ఎల్.విజయ రెడ్డి పాల్గొన్నారు.
బడిలో చేర్పించాలి
బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా పాఠశాల వయసు ఉన్న ప్రతి బిడ్డను బడిలో చేర్పించడమే లక్ష్యంగా ఐసీడీఎస్ విద్యాశాఖ గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో విద్య సీ్త్ర శిశు సంక్షేమ శాఖ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థలతో సమావేశం నిర్వహించి బడి పిలుస్తోంది కార్యక్రమంపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల వయసు పైబడిన పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలని ఆదేశించారు.
అవుట్ సోర్సింగ్
ఉద్యోగుల నిరసన
ముమ్మిడివరం: ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులను ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం ఎదుట కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఐదు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, మున్సిపాలిటీ చెత్త సేకరణ, తరలించే వాహనాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్, సఖిలే సూర్యనారాయణ, పాముబాలయ్య, పెట్టా శివప్రసాదరావు పాల్గొన్నారు.
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
అమలాపురం రూరల్: కృత్రిమ కొరత సృష్టించకుండా నిత్యావసర వస్తువులు, నూనెలు విక్రయించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయ ఉదయ భాస్కరరావు వర్తక సంఘాలకు, నూనె శుద్ధి యూనిట్ల యాజమాన్యాలకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వారితో సమావేశం నిర్వహించారు. డీఎస్‌ఓ మాట్లాడుతూ కృత్రిమ కొరత, అధిక ధరల విక్రయంపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి కె.విశాలాక్షి, అమలాపురం వర్తక సంఘం నాయకులు కుప్పాల రామకృష్ణ, కె.వెంకటరెడ్డి, జి.ముత్యాలరావు కె.నాగరాజు పాల్గొన్నారు.


