అమలాపురం రూరల్: రీ సర్వే అంశాల్లో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోడ్ నిదియాదేవి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రీ సర్వే రెవెన్యూ క్లినిక్‌లు, పౌర సేవలు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక అంశాల పురోగతిపై సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ రెవెన్యూ సేవల్లో పెండింగ్‌కు ఆస్కారం ఇవ్వరాదన్నారు. రీ–సర్వే పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. భూసేకరణ కేసులలో పరిహారం వేగంగా గా చెల్లించాలన్నారు. జాతీయ రహదారుల అధికారుల నోటీసును అనుసరించి అమలాపురం, పేరూరులో భూసేకరణ చేస్తున్న నేపథ్యంలో యాజమాన్య హక్కులను నిర్ధారించడానికి తహసీల్దారు కార్యాలయంలో విచారణ చేశారు. డీఆర్వో వి.సుబ్బారావు ఆర్డీవోలు, సర్వే శాఖ అధికారి కే.ప్రభాకర్, తహసీల్దార్లు పాల్గొన్నారు.


