అమలాపురం టౌన్: కష్టనష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆక్వా, వరి రైతులకు వైఎస్సార్ సీపీ అండగా నిలిచింది. పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను తక్షణమే తగ్గించాలని, ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డి మాండ్ చేసింది. అమలాపురం హైస్కూలు సెంటర్‌లో గురువారం ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో ఆక్వా ఫీడ్, ధాన్యం బస్తాలు, మొక్కజొన్నలు ప్రదర్శనగా ఉం చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన సాగింది. తొలుత హైస్కూలు సెంటర్‌లో ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
చంద్రబాబు ప్రభుత్వంలో కష్టాలు
జగ్గిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఆక్వా రంగం సంక్షోభంలోకి వెళ్లినప్పుడు రైతులకు రాయితీలు ఇచ్చి ఆదుకున్న ఘటనలను వివరించారు. ఢిల్లీలో రైతులు ఉద్యమించినట్లుగా జిల్లా రైతులు కూడా నేషనల్ హైవే పై ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలతో రాస్తోరోకో చేయాలని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ మాట్లాడుతూ ఆక్వా ఽఫీడ్ ధరలు తగ్గించే వరకూ వైఎస్సార్ సీపీ పోరాడుతుందన్నారు. ఆక్వా ఫీడ్ ధరలనుటన్నుకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ పెంచారని పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి) ధ్వజమెత్తారు. ముమ్మిడివరం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ పొన్నాడ సతీష్‌కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఆక్వా కంపెనీలకు మేలు చేసేలా ఫీడ్ ధరలను పెంచారని ఆరోపించారు. రైతులు కష్టాలు పడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేకపోవడం బాధాకరమని రాజోలు నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ పాముల రాజేశ్వరీదేవి అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆక్వా చెరువులకు రూ.1.50కు కరెంట్ ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని అమలాపురం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ప్రశ్నించారు. రామచంద్రపురం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ గతంలో ఫీడ్‌కు అవసరమైన ముడిసరుకు రేట్టు తగ్గినా ఫీడ్ రేట్లను ప్రభుత్వం తగ్గించలేదన్నారు. ఆక్వా ఫీడ్ కంపెనీలు సిండికేట్ అయ్యేందుకు ప్రభుత్వం సహకరిస్తోందని పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆరోపించారు. కోనసీమ ఆక్వా రైతు సంఘ అధ్యక్షుడు రుద్రరాజు నానిరాజు మాట్లాడుతూ యుద్ధాన్ని బూచిగా చూపించి ఆక్వా ధరలను పెంచడం సమంజసం కాదన్నారు. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ప్రసంగించారు.
హైస్కూలు సెంటర్ నుంచి గడియారం స్తంభం సెంటర్ వరకూ నాయకులు పాదయాత్రగా నిరసన ప్రదర్శన చేశారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ మహేష్‌కుమార్‌కు వినతి పత్రం అందించారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొవ్వూరి త్రినాథరెడ్డి, సీఈసీ సభ్యుడు పితాని బాలకృష్ణ, ఎస్‌ఈసీ సభ్యులు కుడుపూడి భరత్ భూషణ్, కాశి మునికుమారి, కుడుపూడి బాబు, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, చింతలపాటి శ్రీనివాసరాజు, కటకంశెట్టి ఆదిత్యకుమార్, కర్రి పాపారాయుడు, పాటి శివకుమార్, కర్రి నాగిరెడ్డి, వంటెద్దు వెంకన్నాయుడు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, నాయకులు గొవ్వాల రాజేష్, మట్టపర్తి నాగేంద్ర, గొల్లపల్లి డేవిడ్‌రాజు, షేక్ అబ్దుల్ ఖాదర్, చొల్లంగి సుబ్బరామ్, విత్తనాల మూర్తి, చీకట్ల కిషోర్, సూదా గణపతి, ఉండ్రు వెంకటేష్, గుత్తుల రాజు, పొగాకు శ్రీను, సాకా ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.
సర్కారు తీరుపై వైఎస్సార్ సీపీ నిరసన
పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను
తగ్గించాలని డిమాండ్
ధాన్యాన్ని మద్దతు ధరకే
కొనాలని నినాదాలు
రైతుల పక్షాన ఉద్యమిస్తామని స్పష్టీకరణ
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత


