కొనసాగుతున్న రొయ్యల చెరువుల తవ్వకాలు ˘ | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న రొయ్యల చెరువుల తవ్వకాలు ˘

May 13 2026 12:20 AM | Updated on May 13 2026 12:20 AM

అయినవిల్లి: మండలంలోని అయినవిల్లి–నేదునూరు గ్రామంలోని కుమ్మరికాలువకు అనుకుని కొందరు రొయ్యల చెరువులు తవ్వుతున్నారు. దీనిపై సోమవారం పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ రాత్రి వేళల్లో తవ్వకాలు సాగుతున్నాయి. ఈ చర్యలను నిలువరించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

ప్రశాంగా ఏపీ ఈఏపీ సెట్‌

అమలాపురం రూరల్‌: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించ ఏపీ ఈఏపీ సెట్‌ (ఎంసెట్‌) పరీక్షలు అమలాపురంలో మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్‌ కళాశాలలో తొలిరోజు ఉదయం, మధ్యాహ్నం షిఫ్ట్‌లలో 166 మందికి 160 మంది పరీక్షలు రాశారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు కో ఆర్డినేటర్‌ అడబాల కుమార్‌, ఏవో జక్కం కృష్ణారావు తెలిపారు. తొలిరోజు 96 శాతం మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు వారు తెలిపారు. పరీక్షలు 18వ తేదీ వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు.

ఏసీబీ వలలో మున్సిపల్‌ డీఈ

రూ.10 వేలు తీసుకుంటుండగా పట్టివేత

సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్‌ డీఈ కె.శశిధర్‌ మంగళవారం ఏసీబీ వలకు చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలిలా.. మున్సిపల్‌ కాంట్రాక్టర్‌ కనూరి పవన్‌కుమార్‌కు రూ.11 లక్షల విలువైన ఐదు బిల్లులు చేయడానికి డీఈ లంచం డిమాండ్‌ చేశారు. మొదటి విడతగా రూ.10 వేలు ఇచ్చేందుకు అంగీకరించిన పవన్‌కుమార్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం రూ.10 వేలు ఇస్తుండగా మున్సిపల్‌ కార్యాలయంలో మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా డీఈని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన నోట్లు మున్సిపల్‌ డీఈ వద్ద ఉండడంతో ఏసీబీ డీఎస్పీ ఎం.కిశోర్‌కుమార్‌ ఆయనపై కేసు నమోదు చేశారు. మున్సిపల్‌ డీఈ తన అసిస్టెంట్‌ ఓదూరి శ్రీనివాసు ద్వారా రూ.10 వేలు తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement