– ఎమ్మెల్సీ ఇజ్రాయిల్
అమలాపురం టౌన్: కోనసీమలోని సహజ సిద్ధ ప్రకృతి అందాలు సినిమాల చిత్రీకరణకు అనువుగా ఉంటాయని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక హోటల్‌లో గురువారం జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
ఏపీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (ఏపీ మా) జిల్లా శాఖ అధ్యక్షుడు మోకా వెంకట సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు తోరం రాజా, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ నాగలక్ష్మి, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, ఏపిమా అధ్యక్షుడు పిల్లా లక్ష్మీ ప్రసాద్, జిల్లా టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. సాయి, జి. పల్లంరాజు ముఖ్య అతిథులుగా ప్రసంగించారు. అనంతరం ఏపీమాకు నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై ంది.
ఏపీమా అధ్యక్షుడిగా పిల్లా లక్ష్మీప్రసాద్, ఉపాధ్యక్షుడిగా ఆవుల వీర శేఖర్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా జానపాటి విశ్వేశ్వరరావు, కోశాధికారిగా గుర్రం వెంకటేశ్వర్లు, కార్యదర్శులుగా రాపేటి అప్పారావు, తెనాలి శకుంతలలు ఎన్నికయ్యారు. ఏపీ సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్స్ యూనియన్‌కు కూడా ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షుడిగా బండ్రెడ్డి శశికుమార్, ఉపాధ్యక్షుడిగా చితిరాల నాగ మధు, ప్రధాన కార్యదర్శిగా కొడదల శివప్రసాద్‌రెడ్డి, కోశాధికారిగా ఉబా ప్రసాద్ ఎన్నికయ్యారు.


