కోలుకుంటున్న ఫుడ్‌ పాయిజన్‌ బాధితులు | - | Sakshi
Sakshi News home page

కోలుకుంటున్న ఫుడ్‌ పాయిజన్‌ బాధితులు

May 9 2026 7:50 AM | Updated on May 9 2026 7:50 AM

15 మంది డిశ్చార్జి

ప్రభుత్వ ఆస్పత్రిలో 30 మందికి,

ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఐదుగురికి చికిత్స

పర్యవేక్షిస్తున్న తహసీల్దారు

కొత్తపేట: వివాహ విందుతో ఫుడ్‌ పాయిజన్‌కు గురైన బాధితులు స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు. వారంతా గురువారం నుంచి స్థానిక సీహెచ్‌సీ, ఒక ప్రైవేట్‌ ఆస్ప్రత్రిలో చికిత్స పొందుతున్నారు. మండల పరిధిలోని వానపల్లి శివారు రామమోహనరావుపేటలో ఓ ఇంట బుధవారం మధ్యాహ్నం విందు భోజనం చేసి, మిగిలిన పదార్థాలను అదే రోజు రాత్రి, మరునాడు ఉదయం కూడా ఆరగించారు. దానికి తోడు వేసవి ఉష్ణోగ్రతలతో ఆహారం ఒంటికి సహించక గురువారం మధ్యాహ్నం 11 నుంచి చిన్నారులు సహా 50 మందికి కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గురువారం రాత్రి 9.30 గంటల వరకు 49 మంది ఆస్పత్రిలో చేరగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ దుర్గారావు దొర ఆధ్వర్యంలో వానపల్లి పీహెచ్‌సీ వైద్యులు వైద్య సేవలు అందజేశారు. రాత్రి 10.45 గంటలకు ఆరుగురిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్‌ చేయగా వారు స్థానిక ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి 13 మంది, ప్రైవేట్‌ ఆస్పత్రి నుంచి ఇద్దరు పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. తహశీల్దార్‌ వై.రాంబాబు ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది ఆయా ఆస్పత్రుల్లో బాధితుల యోగ క్షేమాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు, ముగ్గురు విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారని, మిగిలిన వారికి జ్వరాలు తగ్గాయని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పూర్తిగా కోలుకున్న వారిని డిచ్చార్జ్‌ చేస్తామన్నారు.

రామ్మోహనరావుపేటలో వైద్య శిబిరం

ఫుడ్‌ పాయిజన్‌ జరిగిన వానపల్లి శివారు రామ్మోహన్‌ రావుపేటలో వైద్య నిర్వహిస్తున్నట్టు డీఎంహెచ్‌ఓ ఎం.దుర్గారావుదొర తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు వానపల్లి పీహెచ్‌సీ వైద్యులు జ్వర పీడితులకు రక్త పరీక్షలు చేశారు. సర్వైలెన్స్‌ బృందాలు క్లోరినేషన్‌ చేపట్టినట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement