మండల స్థాయిలో
ప్రథమంగా నిలిచా..
సాక్షి దినపత్రిక పరీక్షలకు రెండు నెలలకు ముందే పలు సబ్జెక్ట్‌ల స్టడీ మెటీరియల్‌ను అందజేసింది. ఆ రెండు నెలలూ స్టడీ మెటీరియల్‌లో ఇచ్చిన మోడల్ పేపర్లను బాగా ప్రాక్టీస్ చేసి ఫాలో అయ్యాను. అందులో చాలా ప్రశ్నలు వచ్చాయి. ఫలితంగా 584 మార్కులు సాధించి మండలంలోనే ప్రథమంగా నిలిచాను.
– మట్టపర్తి కీర్తన, జడ్పీ ఉన్నత పాఠశాల,
నగరం, మామిడికుదురు మండలం
తోడుగా నిలిచింది
పదో పరీక్షలకు ముందు సాక్షి దినపత్రిక ఇచ్చిన స్టడీ మెటీరియల్ నాకు తోడుగా నిలిచింది. ముందుగానే మెటీరియల్ ఇవ్వడంతో అది ఎంతగానో ఉపయోగపడింది. పరీక్షల ఫలితాల్లో 576 మార్కులు సాధించాను.
– షేక్ షీఫీరిజ్జా,
జెడ్పీ బోయస్ ఉన్నత పాఠశాల, అమలాపురం
అమలాపురం టౌన్: పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ‘సాక్షి’ బాసటగా నిలిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పేద విద్యార్థులు తమ ప్రతిభను మరింత విస్తరించుకునేలా, విజయం అందుకునేలా ‘సాక్షి’ తోడుగా నిలిచింది. ‘సాక్షి’ దినపత్రిక సమకూర్చిన ఉచిత స్టడీ మెటీరియల్ వల్లే తాము అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులయ్యామని జిల్లాలోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివిన పదో తరగతి విద్యార్థులు చెబుతున్నారు. మ్యాథ్స్, సైన్స్ పాఠ్యాంశాలపై విద్యా నిపుణులు రూపొందించిన స్టడీ మెటీరియల్ వల్ల ఉత్తమ ఫలితాలు సాకారమయ్యాయని ఉపాధ్యాయులే కాకుండా వాటిని అందుకుని పరీక్షలు రాసిన విద్యార్థులు అంటున్నారు. దీనికి తోడు ‘సాక్షి’ దినపత్రికలో రోజూ పదో తరగతి పాఠ్యాంశాల వారీగా నిపుణుల సూచనలు, సలహాలతో పాఠాలను ప్రచురించడం కూడా విద్యార్థులకు ఉపయోగపడింది. తరగతి గదుల్లో రోజువారీ బోధనతోపాటు సాక్షి ఇచ్చిన స్టడీ మెటీరియల్ ఆధారంగా ఉపాధ్యాయులు ప్రత్యేక తర్ఫీదు ఇచ్చి విద్యార్ధులను పరీక్షలకు సిద్ధం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులు ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా మార్కులు సాధించడంతో ‘సాక్షి’ సహకరించింది.
‘పది’లో ఉత్తమ ఫలితాలకు తోడుగా నిలిచిన ‘సాక్షి’ దినపత్రిక
ఉచిత స్టడీ మెటీరియల్‌తోనే
అత్యధిక మార్కులు
సాధించామంటున్న విద్యార్థులు


