సాక్షి దినపత్రిక అందించిన స్టడీ మెటీరియల్ నాకు పరీక్షల్లో మంచి ప్రోత్సాహం ఇచ్చింది. మెటీరియల్‌తోపాటు ఉపాధ్యాయుల ప్రోత్సాహం కూడా తోడైంది. పరీక్షల ఫలితాల్లో 583 మార్కులు సాధించి మండలంలో ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకున్నాను. విద్యార్థుల్లో ప్రతిభను పదును పెట్టేందుకు సాక్షి చేసిన కృషి అభినందనీయం.
– కొమ్ముల రఘు వైష్ణవి, జెడ్పీ ఉన్నత పాఠశాల, నగరం, మామిడికుదురు మండలం
581 మార్కులు సాధించాను
పదో తరగతి పరీక్షలకు ముందు సాక్షి దినపత్రిక అందించిన స్టడీ మెటీరియల్‌నే ఫాలో అయ్యాను. పరీక్షల్లో 581 మార్కులు సాధించడానికి ఆ స్టడీ మెటిరీయల్ ఉపయోగపడింది. ఉపాధ్యాయులు నిర్వహించిన అదనపు తరగతుల్లో కూడా ఈ స్టడీ మెటిరీయల్‌పై తర్ఫీదు ఇవ్వడంతో ఎక్కువ మార్కులు సాధించేందుకు దోహదపడింది.
– గుండుమేను శివ శైలజ, జెడ్పీ హైస్కూలు, లక్కవరం మలికిపురం మండలం
సపోర్టుగా నిలిచింది
పదో తరగతి పరీక్షల్లో నాకు సాక్షి సపోర్టుగా నిలిచింది. 579 మార్కులు తెచ్చుకుని మండలంలోనే ప్రథమ స్థానంలో నిలిచాను. సాక్షి యాజమాన్యం అందించిన మోడల్ పేపర్లు చాలా ఉపయోగపడ్డాయి. ఉపాధ్యాయుల దీటైన బోధనతోపాటు సాక్షి స్టడీ మెటీరియల్‌ను కూడా ప్రాక్టీస్ చేయిండచంతో ఈ ఉత్తమ ఫలితం సాధించాను.
– కట్టా మోహన్ సాయి శ్రీహర్ష, జెడ్పీ హైస్కూలు, రావులపాలెం
మెటీరియల్ ఉపయోగపడింది
పదో తరగతి పరీక్షల్లో సాక్షి దినపత్రిక ఇచ్చిన స్టడీ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడింది. నేను పరీక్షల్లో 572 మార్కులు సాధించానంటే అందుకు ఆ స్టడీ మెటీరియలే కారణం. ముఖ్యంగా లెక్కలు, సైన్స్ పాఠ్యాంశాలపరంగా సాక్షి స్టడీ మెటీరియల్ చదవం వల్లే మెళకువలను తెలుసుకుని పరీక్షలు రాశాను.
– చిట్టిమేను యశస్విని,
జెడ్పీ హైస్కూలు, దేవగుప్తం, అల్లవరం మండలం
‘సాక్షి’కి థ్యాంక్స్
పదో తరగతి పరీక్షల్లో మంచి కీలక సమయంలో సాక్షి దినపత్రిక స్టడీ మెటీరియల్‌ను అందించి విద్యార్ధులకు ఫలితాల పరంగా మంచి చేయూత ఇచ్చింది. నేను 579 మార్కులు సాధించానంటే అందుకు సాక్షి అందించిన తోడ్పాటే. సాక్షికి నా థ్యాంక్స్.
– మందపాటి స్వప్న,
జెడ్పీ హైస్కూలు, బట్టేలంక, మలికిపురం మండలం
భవిష్యత్తుకు పునాది
సాక్షి దినపత్రిక అందించిన స్టడీ మెటీరియల్ నా ఉన్నత భవిష్యత్తుకు పునాది వేసింది. నేను పరీక్షల్లో 575 మార్కులు సంపాదించాను. నాలాంటి పేద విద్యార్ధులకు స్టడీ మెటీరియల్‌తో బాసటగా నిలిచింది. విద్యార్థుల్లో ప్రతిభను పదును పెట్టేందుకు సాక్షి చేసిన కృషి అభినందనీయం.
– మేకా వీర నాగ సాయి,
జెడ్పీ హైస్కూలు, కొత్తపేట


