అల్లవరం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన విద్యా సంస్కరణలతో నేటి పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మంచి మార్కులు సాధించారని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా అనురాధ బుధవారం ప్రకటనలో తెలిపారు. నాడు నేడు పథకం ద్వారా తొమ్మిది రకాల మౌలిక సౌకర్యాలు కల్పించారని, శిథిలావస్థలో ఉన్న పాఠశాలల స్థానంలో కొత్త భవనాలు నిర్మించారని తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా రూ.15 వేలను తల్లుల ఖాతాలకు జమ చేశారని పేర్కొన్నారు. జగనన్న విద్యాకానుక ద్వారా యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, షూస్, నోట్ పుస్తకాలు, బ్యాగ్ అందించారని తెలిపారు. కార్పోరేట్ స్కూల్‌కి దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారన్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించారని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ఏర్పాటుచేసి దేశానికే ఆదర్శంగా నిలిచారని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి అమలుచేసిన విద్యా సంస్కరణలతోనే నేటి పదవ తరగతిలో 600 కి 596 మార్కులను నలుగురు విద్యార్థులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానాన్ని కై వసం చేసుకొన్నారని, మరో తొమ్మిది మంది 595 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచారన్నారు. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు వేలల్లో ఉన్నారన్నారు.
భర్త చనిపోతే భార్యకు పింఛన్
అమలాపురం రూరల్: భర్త పింఛను పొందుతూ చనిపోతే భార్యకు స్పౌజ్ పింఛన్ మార్పు చేసి అందిస్తామని డీఆర్‌డీఏ పీడీ రాంబాబు బుధవారం తెలిపారు. వృద్ధాప్య, వైధవ్య, వికలాంగ, హెల్త్ వంటి పింఛన్లు కొత్తవి ఇవ్వడానికి ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసిందని త్వరలో మంజూరు చేయనుందన్నారు.


