● కష్టకాలంలో అందని చేయూత
● అకాల వర్షానికి దెబ్బతిన్న రబీ వరి
● కోత యంత్రాలు దిగక
నిలిచిన మాసూళ్లు
● గట్ల మీదనే గడ్డి సేకరణ యంత్రాలు
● తడిసిన ధాన్యం ఆరబోతకు కూలీల కొరత
● మరోవైపు ఆగని ఉపాధి హామీ పనులు
● గత ప్రభుత్వంలో
ఉపాధి కూలీల ద్వారా పంట ఒబ్బిడి
● జిల్లాలో 15 వేల ఎకరాలకు
పైబడి ధాన్యం రాశులపైనే
కె.గంగవరంలో తడిసిన ధాన్యం
ఆరబెట్టుకుంటున్న రైతులు
సాక్షి, అమలాపురం: ఆపత్కాలంలో అన్నదాతను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. భారీ వర్షాల వల్ల ఒకవైపు పంట దెబ్బతినడం.. మరోవైపు యంత్రాలతో కోతలు నిలిచిపోయి కూలీల కోసం రైతులు ఎదురు తెన్నులు చూస్తున్న సమయం ఇది. ఇలాంటి సమయంలో ఉపాధి పనిదినాల పేరుతో జిల్లా యంత్రాంగం ఉపాధి కార్మికులను అందుబాటులో లేకుండా చేస్తోంది. జిల్లాలో ఈ నెల 3వ తేదీన రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షం రైతుల వెన్ను విరిచింది. వర్షాల సమయంలో సుమారు 15 వేల ఎకరాలకు సరిపడా 56,260 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల వద్దనే ఉంది. సుమారు 10 శాతం ధాన్యం తడిసిపోయింది. చేలల్లో రాశులు ఉంచిన రైతులకు ఎక్కువగా దెబ్బతగిలింది. దీనిని గట్ల మీదకు చేర్చి ఎండబెట్టడం రైతులకు ఇప్పుడు తలకుమించిన భారంగా మారింది. వర్షం వల్ల చేలల్లో నీరు చేరడంతో వారం రోజుల పాటు యంత్రాలు దిగే అవకాశం లేదు. పడిపోయిన చేలతోపాటు పక్వానికి వచ్చిన చేలల్లో కోతలు అత్యవసరంగా చేయాలి. చేలల్లో ఉండిపోయిన గడ్డిని ఒబ్బిడి చేయాలి. కాని ఈ సమయంలో కూలీలు లేకపోవడంతో రైతులు హైరానా పడుతున్నారు. మరోవైపు పురుషులకు రూ.600 నుంచి రూ.700 వరకు ఉన్న కూలీ ఇప్పుడు రూ.750 నుంచి రూ.800కు చేరింది. మహిళలకు రూ.450 వరకు ఉన్న కూలీ రూ.500కు పెంచారు. ఇది తమకు మరింత భారంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో కోతలకు ఎక్కువ మంది కూలీలు అవసరమవుతున్నారు. ఎకరాకు 12 మంది కూలీలు అవసరం కాగా, పడిపోయిన చేలల్లో కోతలకు 15 మంది అవసరమవుతున్నారు. ఈ విపత్కర సమయంలో ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేతులు ఎత్తివేసింది. తడిసిన ధాన్యం కొనుగోలుపై నోరు మెదడపం లేదు. మరోవైపు ఉపాధి కార్మికులతో వ్యవసాయ పనులు చేయించాలనే రైతుల డిమాండ్ పట్టించుకోవడం లేదు. దీనిపై సోమవారం కలెక్టరేట్ వద్ద భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్), కోనసీమ రైతు సంఘాలు ధర్నా చేశాయి.
అది 2023 ఏప్రిల్ నెలాఖరు సమయం. జిల్లాలో రబీ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న వేళ మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు రైతులను నిలువునా ముంచాయి. రైతులను అన్ని రకాలుగా ఆదుకోవాలని నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు జిల్లా యంత్రాంగం వేగంగా స్పందించింది. నాటి కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో రైతులకు చేదోడుగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) వేతనదారులతో వ్యవసాయ పనులు చేయించారు. నీట మునిగిన పనులు ఒబ్బిడి చేయడం, ధాన్యం రాశులను గట్ల మీదకు చేర్చడం, నీట మునిగిన చేలల్లో ఉన్న ముంపు నీరు దిగేలా బోదెలు వేయించడం చేశారు. మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 1,03,000 ఉపాధి పనిదినాలు అమలు చేయడంతో రైతులు ముంపు ముప్పు నుంచి తక్కువ నష్టంతో బయటపడ్డారు.
నా డు


