వీబీజీ రామ్ జీగా కొత్త రూపం సంతరిచంకున్న ఉపాధి హామీ పథకం పనులు గత పది రోజుల వరకు జిల్లాలో మందకొడిగా సాగాయి. కాని ఇప్పుడు రోజుకు ఏకంగా 50 వేల పని దినాలు కల్పిస్తున్నామని ఈ పథకం అధికారులు గొప్పలు చెప్పుకుంటున్నారు. అకాల వర్షంతో రబీ అస్తవ్యసంగా మారిన నేపథ్యంలో ఉపాధి పనులు ఆపాలని, ఉపాధి వేతనదారులతో దెబ్బతిన్న పంటను రక్షించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులకు లక్ష్యం గుర్తుకు రావడం గమనార్హం. దీనివల్ల రైతులకు కూలీలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.
నే డు


