అమలాపురం పోస్టల్‌ డివిజన్‌కు 9 అవార్డులు | - | Sakshi
Sakshi News home page

అమలాపురం పోస్టల్‌ డివిజన్‌కు 9 అవార్డులు

May 6 2026 8:13 AM | Updated on May 6 2026 8:13 AM

అమలాపురం టౌన్‌: రాష్ట్ర స్థాయిలో (ఏపీ పోస్టల్‌ సర్కిల్‌) 2025–26 సంవత్సరానికి అమలాపురం పోస్టల్‌ డివిజన్‌కు పలు విభాగాల్లో ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కాయి. అమలాపురం డివిజన్‌ పోస్టల్‌ సిబ్బంది 9 అవార్డులు, ప్రశంసా పత్రాలు కూడా కై వసం చేసుకున్నారు. ఈ విషయాలను అమలాపురం పోస్టల్‌ డివిజన్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌.శ్రీకర్‌ బాబు వెల్లడించారు. ఇటీవల బాపట్లలో జరిగిన పోస్టల్‌ ఉన్నతాధికారుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ బీపీ శ్రీదేవి చేతుల మీదుగా అమలాపురం పోస్టల్‌ సూపరింటెండెంట్‌ శ్రీకర్‌బాబు ద్వితీయ, తృతీయ స్థానాలతో పాటు అవార్డులు అందుకున్నారు. నికర ఖాతాలు తెరవడంలో రాష్ట్ర స్థాయిలో డివిజన్‌ ద్వితీయ స్థానాన్ని, డిజిటల్‌ ట్రాన్స్‌క్షన్స్‌లో తృతీయ స్థానాన్ని సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement