సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మంగళవారం ఎండోమెంట్స్ అధికారులు నిర్వహించిన వివిధ హుండీల లెక్కింపుల్లో భక్తుల నుంచి విరాళాలు రూపంలో మొత్తం రూ.18,92,187 ఆదాయం చేకూరింది. మార్చి 31 నుంచి మే 5వ తేదీ వరకూ 36 రోజులకు పై ఆదాయం వచ్చింది. ఎండోమెంట్స్ అమలాపురం తనిఖీదారుడు జె.రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో సిబ్బంది ఆలయంలోని హుండీలను తెరచి లెక్కింపు చేపట్టారు. ప్రధాన ఆలయ హుండీల ద్వారా రూ.18,61,780, గుర్రాలక్క అమ్మవారి ఆలయ హుండీ ద్వారా రూ.10,847, అన్నదానం హుండీల ద్వారా రూ.19,560 లభించినట్టు ఆలయ ఈవో ఎంకేటీఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. ఎంపీటీసీ సభ్యుడు బైరా నాగరాజు, స్వామివారి సేవకులు పాల్గొన్నారు.


