64,500 ఎకరాల్లో వరి కోతలు పూర్తి | - | Sakshi
Sakshi News home page

64,500 ఎకరాల్లో వరి కోతలు పూర్తి

May 4 2026 7:37 AM | Updated on May 4 2026 7:37 AM

పి.గన్నవరం: జిల్లాలో 64,500 ఎకరాల్లో వరికోతలు పూర్తయ్యాయని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.వెంకట రామారావు తెలిపారు. ఆదివారం ఆయన మండలం రాజులపాలెం శివారు మర్రిగుంటలో అకాల వర్షానికి తడిసిన ధాన్యం రాశులను పరిశీలించి తీసుకోవలసిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదివారం కాట్రేనికోన, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం మండలాల్లో అధిక వర్షం కురిసిందన్నారు. ఆయన వెంట డీఆర్‌సీఏడీ ఏడీఏ ఏవీఎస్‌ రాజశేఖర్‌, ఇన్‌చార్జి ఏడీఏ సీహెచ్‌డీ విజయకుమార్‌, వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement