వాడపల్లికి పోటెత్తిన భక్తజనం | - | Sakshi
Sakshi News home page

వాడపల్లికి పోటెత్తిన భక్తజనం

May 3 2026 7:47 AM | Updated on May 3 2026 7:47 AM

ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరుని దర్శనానికి శనివారం భారీగా భక్తులు పోటెత్తారు. ఏడు శనివారాలు వ్రతాలు ఆచరిస్తున్న భక్తులతో పాటు సాధారణ భక్తులతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జామునే సుప్రభాత సేవ, తొలి హారతి, నిరాజనం, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాల భోగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని, స్వామివారిని సుందరంగా అలంకరించారు. కాగా పెద్ద సంఖ్యలో భక్తులు ఉచిత అన్న, తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు. సత్య సాయి సేవా సంస్థలు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో, దేవదాయ శాఖ ఉప కమిషనర్‌ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ చైర్మన్‌ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

స్వామివారి దర్శనానికి బారులు

తీరిన భక్తులు. (అంతర చిత్రం) ప్రత్యేక అలంకరణలో స్వామి, అమ్మవార్లు

Advertisement
 
Advertisement
Advertisement