అమలాపురం రూరల్: అత్తమామల వేధింపులు తాళలేక జీవితంపై విరక్తి చెంది వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అమలాపురం మండలం బండారులంకలో శనివారం చోటుచేసుకుంది. బండారులంక దంగేటివారిపాలేనికి చెందిన కడలి సాయి వెంకట జ్యోతి (24 ) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బండారులంక చెందిన కడలి శిరీష్‌తో ఆమెకు 2021లో వివాహమైంది. ఐదేళ్లుగా పిల్లలు లేకపోవడంతో మనస్తాపానికి గురైంది. ఇంట్లో భర్త, అత్తమామలు, బంధువులు జ్యోతిని వేధింపులకు గురిచేశారు. అవి భరించలేక జ్యోతి శనివారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తల్లి దంగేటి సత్యవతి తాలూకా పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఎస్సై శేఖర్‌బాబు కేసు నమోదు చేసి విచారణ చేశారు. మృతదేహాన్ని పరిశీలించి ఆత్తమామలు, బంధువులు నలుగురిపై వేధింపులు, గృహ హింస కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఏరియా అసుపత్రికి తరలించారు.


