బడి | - | Sakshi
Sakshi News home page

బడి

May 2 2026 8:14 AM | Updated on May 2 2026 8:14 AM

నాడు మన నేడు నిల

ప్రతిఫలిస్తున్న గత వైఎస్సార్‌ సీపీ

ప్రభుత్వ పథకాలు

పదో తరగతి ఫలితాల్లో

సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలలు

రెండేళ్లుగా రాష్ట్రస్థాయి

రెండో స్థానంలో కోనసీమ జిల్లా

97 ప్రభుత్వ, అనుబంధ

పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత

సాక్షి, అమలాపురం: ‘చేసేది ఏమిటో.. చేసేయి సూటిగా.. వేసేయి పాగా ఈ తోటలో’ అని సీనియర్‌ సముద్రాల వారు అన్నట్టు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాను అనుకున్న పథకాలు కచ్చితంగా అమలు చేయడంతో వాటి ఫలితాలు నేడు వ్యక్తమవుతున్నాయి. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ‘మనబడి నాడు–నేడు’ పథకం కింద చేపట్టిన పలు కార్యక్రమాలు ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాల రూపంలో చూస్తున్నాం. విద్యార్థి జీవితంలో మొదటి మెట్టు పదో తరగతిని జిల్లా విద్యార్థులు అలవోకగా ఎక్కేశారు. గురువారం విడుదలైన ఆ పరీక్షా ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. జోన్‌–2 పరిధిలో అయితే మొదటి స్థానాన్ని కై వసం చేసుకుంది. ఇంతటి ఘనత సాధించారంటే అంతకు పూర్వ రంగం ఎంతో గొప్పగా ఉంటేనే సాధ్యమవుతుందన్నది అందరూ గుర్తించాల్సిందే. ఈ విషయమే సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. విద్యార్థుల సాధన ఒక ఎత్తయితే గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం విద్యాశాఖకు ఇచ్చిన ప్రోత్సాహం ఎనలేనిది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు పోషకాహారం అందజేయడం, యూనిఫాం, ఆధునిక, సాంకేతిక పద్ధతుల్లో బోధన ఇలా ప్రతి విషయంలో కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా పాఠశాల విద్యకు గట్టి పునాది వేశారు.

● జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 19,138 మంది హాజరు కాగా 18,343 మంది (95.85 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది స్థానాన్నే మళ్లీ సాధించినా, అప్పటి 91.43 శాతం ఉత్తీర్ణతను అధిగమించడం గమనార్హం.

● 92 శాతం మంది, అంటే 16,866 ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది ఫలితాలతో పోలిస్తే 2,362 మంది అదనం.

● 87 జెడ్పీ, రెండు ప్రభుత్వ, ఒక ఎయిడెడ్‌, రెండు బీసీ సంక్షేమ రెసిడెన్షియల్‌, రెండు సాంఘిక సంక్షేమ వసతి పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి.

● అల్లవరం మండలం సామంత్రకుర్రు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన శిరిగినీడి రిషితా లక్ష్మీ నిహారిక 596 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల విభాగంలో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈసారి 590 మార్కులు దాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 12 మంది.

ముమ్మిడివరం మండలం అనాతవరం ఉన్నత పాఠశాలలో ట్యాబ్‌లతో విద్యార్థులు

Advertisement
 
Advertisement
Advertisement