విలువలు పాటించిన నేత చిట్టబ్బాయి | - | Sakshi
Sakshi News home page

విలువలు పాటించిన నేత చిట్టబ్బాయి

Apr 30 2026 8:07 AM | Updated on Apr 30 2026 8:07 AM

అమలాపురం టౌన్‌: వైఎస్సార్‌ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి తుది శ్వాస విడిచే దాకా రాజకీయ విలువలు పాటించారని పలువురు కొనియాడారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పార్టీ తొలి అధ్యక్షునిగా పనిచేసిన చిట్టబ్బాయి 5 వర్ధంతి కార్యక్రమాలు పట్టణంలో బుధవారం జరిగాయి. అమలాపురం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌, ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్‌, కుడుపూడి సూర్యనారాయణరావు, పార్టీ మహిళా విభాగం జోన్‌–2 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎంపీ చింతా అనురాధ, పి.గన్నవరం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్‌ గన్నవరపు శ్రీనివాసరావు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక గడియారం స్తంభం సెంటర్‌లోని గుర్రపు బండ్ల స్టాండ్‌లో గల చిట్టబ్బాయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజాయితీగా, నిర్మొహమాటంగా మాట్లాడం చిట్టబ్బాయి నైజమని, తన రాజకీయ జీవితంలో ఆస్తులను సైతం పోగొట్టుకున్న నిస్వార్థ నాయకుడు చిట్టబ్బాయి అని స్మరించుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, ఎస్‌ఈసీ సభ్యులు కుడుపూడి భరత్‌ భూషణ్‌, కాశి మునికుమారి, జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరి రామగోపాల్‌, అల్లవరం ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, అమలాపురం పట్టణం, అల్లవరం మండల పార్టీ అధ్యక్షులు సంసాని బులినాని, కొనుకు బాపూజీ, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్య నాగేంద్రమణి, పార్టీ అనుబంధ కమిటీల రాష్ట్ర, జిల్లా నాయకులు, అధ్యక్షులు మట్టపర్తి నాగేంద్ర, షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌, గొవ్వాల రాజేష్‌, పీకే రావు, కముజు రమణ, విత్తనాల మూర్తి, ఊటుకూరి సుబ్రహ్మణ్యం, చిట్టూరి పెదబాబు, కేతా భాను తేజ, అడపా బాబులు, చెల్లుబోయిన నాని, విత్తనాల ఇంద్ర శేఖర్‌, దొమ్మేటి రాము, గుత్తుల రాజు, ఈతకోట శ్రావణ్‌ పాల్గొన్నారు. స్థానిక సూర్య నగర్‌లోని చిట్టబ్బాయి స్వగృహంలో ఆయన భార్య అరుణ, కుమారుడు భరత్‌ భూషణ్‌, కోడలు సత్య శైలజ వర్ధంతి నిర్వహించారు.

వర్ధంతి కార్యక్రమాల్లో వక్తలు

Advertisement
 
Advertisement
Advertisement