యూరియా వాడకం తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

యూరియా వాడకం తగ్గించాలి

Apr 30 2026 8:01 AM | Updated on Apr 30 2026 8:01 AM

అమలాపురం రూరల్‌: వ్యవసాయ రంగంలో రసాయన ఎరువుల వినియోగాన్ని ముఖ్యంగా యూరియా వాడకాన్ని గణనీయంగా తగ్గించి సేంద్రియ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి యూరియా సమస్యలు పీఎండీఎస్‌ ప్రోత్సాహకాలపై వ్యవసాయ ఉద్యాన సేర్ప్‌ సిబ్బందితో సమీక్షించారు.

బీసీ రిజర్వేషన్‌ కోటాపై వినతుల స్వీకరణ

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ కోటాపై వినతులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్‌ బుధవారం కమిషన్‌ అధ్యక్షుడుగా విశ్రాంతి ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మే 4 న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాజమహేంద్రవరం ఆర్‌ అండ్‌బీ అతిథిగృహంలో వినతి పత్రాలు స్వీకరిస్తారని తెలిపారు.

ఇబ్బందులు తగ్గాయి

జిల్లాలో వారం రోజులుగా నెలకొన్న డీజిల్‌ కొరత ఇబ్బందులు తగ్గాయని ప్రస్తుతం అన్ని పెట్రోల్‌ బంకుల వద్ద సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కలెక్టర్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన సమవేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ సివిల్‌ సప్లైస్‌, రెవెన్యూ అధికారులు బంకులను తనిఖీ చేస్తూ నిల్వల వివరాలను ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తున్నారన్నారు.

ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ నిర్మాణ

సమస్యలను పరిష్కరించాలి

అయినవిల్లిలో ఏర్పాటు చేస్తున్న 400 కేవీ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ నిర్మాణంలో ఎదురైన సమస్యలను పరిష్కరిం చుకోవాలని కలెక్టర్‌ ట్రాన్స్‌కో ఇంజినీర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఇంజినీర్లతో సమీక్షిస్తూ చిరుతపూడి ప్రభల తీర్థంకు అడ్డంకిగా ట్రాన్స్‌మిషన్‌ లైను రావడంతో పక్కకు జరపాలని ఉత్సవ ప్రతినిధులు కోరుతున్నారని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement