జూన్‌ నెలాఖరునాటికి నూతన టెర్మినల్‌ భవనం పూర్తి | - | Sakshi
Sakshi News home page

జూన్‌ నెలాఖరునాటికి నూతన టెర్మినల్‌ భవనం పూర్తి

Apr 30 2026 8:01 AM | Updated on Apr 30 2026 8:01 AM

కోరుకొండ: జూన్‌ నెలాఖరు నాటికి మధురపూడి విమానాశ్రయంలో నిర్మాణ దశలోఉన్న నూతన టెర్మినల్‌ భవనం పూర్తవుతుందని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సదరన్‌ రీజియన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎం.రాజ్‌కిషోర్‌ తెలిపారు. విమానాశ్రయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలన నిమిత్తం బుధవారం ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు ఇక్కడికొచ్చారు. అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకుని ఇంజినీర్లకు సూచనలిచ్చారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజమహేంద్రవరం నుంచి ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌, చైన్నె, బెంగళూరు, తిరుపతికి సర్వీసులున్నట్టు, దానికణుగుణంగా అయోధ్య, వారణాసిలకు నిర్వహించడానికి ఎయిర్‌లైన్స్‌ సంస్థతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. జనరల్‌ మేనేజర్‌ వసుంధర, ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ కె.ప్రీతి, ప్రాజెక్టు ఇన్‌చార్జి వి.శ్రీనివాసు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement