డీజిల్‌ కొరతతో తీవ్ర ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

డీజిల్‌ కొరతతో తీవ్ర ఇబ్బందులు

Apr 29 2026 7:42 AM | Updated on Apr 29 2026 7:42 AM

మాకు ఆటోనే జీవనాధారం. ఇటీవల కొన్ని రోజులుగా డీజిల్‌ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రోజుకు సగటున లోకల్‌ ట్రిప్‌ల కోసం నాలుగు నుంచి ఆరు లీటర్లు అవసరం. దూర ప్రాంతానికి అయితే కనీసం పది లీటర్లు పడుతుంది. కానీ బంకుల్లో రూ.200 మాత్రమే కొడుతున్నారు. దానికి కూడా రెండు గంటలు లైన్లో ఉండాలి. ఒక పూట, ఒక్కో రోజు ఆటో పక్కన పెట్టేయాల్సిన దుస్థితి. ఎక్కడన్నా ఆగిపోతే బ్లాక్‌లో లీటరు రూ.125 చేసి కొనుగోలు చేస్తున్నాం.

– తరెట్ల రజనీకాంత్‌, ప్రెసిడెంట్‌, దుర్గా సిద్ధివినాయక ఆటో యూనియన్‌, కొత్తపేట

5 గంటలు నిలుచుంటే 2 లీటర్లు

జిల్లాలో డీజిల్‌ కొరత ఏర్పడినప్పటి నుంచి బంకుల వద్ద మూడు నుంచి ఐదు గంటల వేచి ఉంటే రెండు లీటర్లు డీజిల్‌ దొరుకుతుంది. అది రెండు రోజుల నుంచి అసలు దొరకడం లేదు. రోజు వారీ కిరాయిలు, రూట్‌లలో ఆటోలు నడపలేకపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసినప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు డీజిల్‌ లేక స్టాండ్‌లో ఆటోలను ఖాళీగా పెట్టుకుంటున్నాం.

– వాసంశెట్టి సత్తిరాజు, జిల్లా ఆటో యూనియన్‌ అధ్యక్షుడు, అమలాపురం

Advertisement
 
Advertisement
Advertisement