సాక్షి, అమలాపురం: చంద్రబాబు సర్కారులో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. గోదావరిని చెరబట్టి అడ్డుగోలు దోపిడీ చేస్తున్నారు. సహజ సిద్ధంగా ఏర్పడిన లంకలను కొల్లగొట్టి గుల్ల చేస్తున్నారు. అభివృద్ధి పనుల ముసుగులో కొందరు, అనుమతులు పేరుతో మరికొందరు ఇష్టానుసారం తవ్వకాలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ తవ్వకాల వల్ల గోదావరి గమనం మారి ఏటిగట్లకు ప్రమాదం ఏర్పడడంతో పాటు కొన్ని లంక గ్రామాలు కనుమరుగయ్యే దుస్థితి కల్పిస్తున్నారు. ఇప్పటికే పి.గన్నవరం మండలం కేంద్రంగా సాగుతున్న మట్టి దందాకు, ఇప్పుడు ఆత్రేయపురం మండలం తోడయ్యింది.
యథేచ్ఛగా..
తాజాగా తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వీరవరం రెవెన్యూ పరిధిలోని గోదావరి లంక భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. భారీ యంత్రాలను వినియోగించి పగలు, రాత్రి అనే తేడా లేకుండా లంక మట్టిని తవ్వేసి సమీపంలోని ఇటుక బట్టీలకు విక్రయాలు చేస్తున్నారు. తవ్వకాలు జరిపే చోట లారీ మట్టి రూ.1,200 చేసి అమ్మకాలు చేస్తున్నారని తెలిసింది. వీటికి అనుమతులు ఉన్నాయని తవ్వకం దారులు చెబుతున్నారు. పనిలో పనిగా వీరు సరి‘హద్దు’లు దాటి గౌతమీ నది కుడివైపునకు కూడా వచ్చేస్తున్నారు. ఆత్రేయపురం మండలం వద్దిపర్రు గ్రామ శివారు రెడ్డిపల్లిలో వరకు మట్టి తవ్వకాలు విస్తరించాయి.
అక్రమంగా తరలింపు
కోనసీమ జిల్లా పరిధిలో తవ్వకాలు చేస్తున్న అక్రమార్కులు లంకల నుంచి నేరుగా తూర్పు గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే కడియం మండలం బుర్రిలంక, పొట్టిలంకల ఏటిగట్ల మీద నుంచి చొప్పెల్ల, ఆలమూరు, కపిలేశ్వరపురం, అయినవిల్లి మీదుగా ఇటుక బట్టీలకు మట్టిని తరలిస్తున్నారు. దీనితోపాటు మరికొంత మట్టి ప్రైవేట్ ఇళ్ల రియల్ ఎస్టేట్లకు మళ్లిపోతోంది. ఇలా రోజుకు 40 నుంచి 50 లారీల మట్టి తవ్వకాలు సాగుతున్నాయని అంచనా. జేసీబీలను తరలించి లారీలు వెళ్లేందుకు బాటలు వేసి మరీ ఇక్కడ తవ్వకాలు సాగిస్తున్నారు. ఏటిగట్ల వెంబడి లారీల రాకపోకలు జోరుగా సాగుతున్నాయి. ఈ లంక గ్రామాల్లో సుమారు 50 ఎకరాలకు సంబంధించిన భూమిపై దశాబ్దాల కాలంగా అనేక వివాదాలు నడుస్తున్నా అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. వీటి మీద తూర్పు గోదావరి, కోనసీమ జిల్లా మైనింగ్ అధికారులు నోరు మెదపడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలకు అనుమతులు మంజూరు చేయడం గమనార్హం.
ఆగని దందా
జాతీయ రహదారి 216ఏపై జొన్నాడ వద్ద సాగుతున్న ఫ్లైఓవర్ పేరుతో పి.గన్నవరంలో సాగుతున్న మట్టి దందా ఆగడం లేదు. ఈ విషయాన్ని ‘సాక్షి’ ఈనెల 10వ తేదీన ‘తమ్ముళ్ల ఫ్లైఓవర్ యాక్షన్’ పేరుతో వెలుగులోకి తెచ్చినా అధికార యంత్రాంగంలో స్పందన లేదు. గత రెండేళ్లుగా ఫ్లైఓవర్ నిర్మాణంలో కీలకమైన అప్రోచ్ రోడ్డుకు మట్టి కావాల్సి ఉందని, దానిని సేకరించేందుకు అంటూ అనుమతులు పొందుతున్నారు. పి.గన్నవరం మండలం యర్రంశెట్టివారి పాలెం (వైవీ పాలెం) మీదుగా ఎల్.గన్నవరం పరిధిలో, ఉడుమూడిలంకల్లో తవ్వకాలు చేసి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ములు చేసుకోవడం పరిపాటిగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కీలక తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధుల సన్నహితులు కనుసన్ననలలో ఇక్కడ మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. వీరికి స్థానిక అధికార పార్టీ నేతల ఆశీస్సులు ఉండడంతో అడ్డుకునేవారు లేకుండా పోతున్నారు.
లే అవుట్ల ఫిల్లింగ్‌కు..
ఎల్.గన్నవరం వద్ద ఎకరం భూమిలోనూ, ఉడిమూడిలంక వద్ద రెండు ఎకరాల భూమిలో మట్టి తవ్వకాలకు అనుమతులు పొందారు. ఎల్.గన్నవరంలో తువ్వ ఇసుకను సేకరించి లేఅవుట్ల ఫిల్లింగ్‌కు అమ్మకాలు చేస్తున్నారు. అలాగే ఉడుమూడిలంకలో మట్టి సేకరించి లేఅవుట్లకు, ఆలమూరు మండలం జొన్నాడ, ఆలమూరు, కపిలేశ్వరపురం మండలం కేదార్లంక వద్ద ఇటుక బట్టీలకు, లేఅవుట్ల సైట్ ఫిల్లింగ్‌కు దొడ్డి దారిన అమ్మకాలు చేస్తున్నారు. తువ్వ ఇసుక రోజుకు 30 లారీల నుంచి 40 లారీల వరకు తరలిస్తుండగా, ఉడమూడిలంక వద్ద పది నుంచి ఇరవై లారీల మట్టి తరలిపోతోంది. ఒక్క లారీ కూడా మట్టి, తువ్వ ఇసుకను జొన్నాడ ఫ్లైఓవర్ వద్ద డంప్ చేయకపోవడం గమనార్హం. జొన్నాడ ఫ్లైఓవర్ అప్రోచ్ పనులు ఇటీవల మొదలయ్యాయి. నిర్మాణ సంస్థ అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ప్రస్తుతం ఫ్లైయాష్ మాత్రమే వినియోగిస్తోంది. కానీ ఇక్కడ తువ్వ ఇసుక, మట్టి వినియోగిస్తున్న దాఖలాలు లేవు. రావులపాలెం మండలం గోపాలపురంలో సైతం మట్టి తవ్వకాలు మొదలు పెట్టారు. సరిహద్దును ఆనుకుని ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తంగా కావడంతో రెండు రోజుల క్రితం తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
·˘ ÌS…MýS Ð]l$sìæt° ™èlÐólÓ-çÜ$¢¯]l² A{MýS-Ð]l*-Æý‡$PË$
·˘ ™égêV> «§ýlÐ]l-âôæ-ÔèæÓÆý‡…
బ్యారేజీ దిగువన జోరుగా తవ్వకాలు
·˘ í³.VýS-¯]l²Ð]lÆý‡…™ø ´ër$
ఆత్రేయపురానికి విస్తరించిన దందా
·˘ Mø¯]l-ïÜÐ]l$ hÌêÏ OÐðlç³# ™èlÐ]lÓ-M>Ë$
·˘ ™èl*Æý‡$µ Vø§éÐ]lÇ OÐðlç³# ™èlÆý‡-Í…ç³#
·˘ ç³sìæt…^èl$-Mø° ^èl…{§ýl-»êº$ çÜÆ>PÆŠ‡
కోత బారిన..
సహజ సిద్ధంగా ఏర్పడిన లంక భూముల్లో మట్టిని తవ్వేస్తే, ఆ తర్వాత ఉన్న భూములు ప్రవాహ వేగానికి కోతకు గురవుతాయని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి లంకల మధ్య సాగుతున్న ఈ తవ్వకాలు ఆయా గ్రామాలకు పెను ముప్పుగా మారాయి. భవిష్యత్తులో ఇక్కడ స్థానికులు నివాసం ఉండలేని ప్రమాదం నెలకొంది. వశిష్ట నదీపాయ మధ్య ఉన్న ఈ లంక గ్రామాలకు నదీకోత పెనుముప్పుగా మారింది. ఏటా వరద ఉధృతికి గోదావరిలో లంక భూములు కలిసి పోతున్నాయి. దీనికి మట్టి తవ్వకాలు తోడు కావడంతో ఈ గ్రామాల ఉనికే ప్రశ్నార్థకంగా మారుతోంది. కొందరు వ్యక్తుల స్వార్థానికి పంటలు పండే భూములను తాము కోల్పోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.


