కొత్తపేట: తెలుగు వారి పండగల్లో అతి ముఖ్యమైనది ఉగాది. మామిడి తోరణాలు, ఉగాది పచ్చడి, పంచాంగ పఠనం, కవి సమ్మేళనాలు, కమ్మనైన పిండి వంటల రుచులు దీని ప్రత్యేకతలు. జీవితంలో కష్టసుఖాలు, సంతోషాలు, దుఖాలు, భావావేశాలు, ప్రేమానురాగాలకు ప్రతీకగా భావించే ఉగాది పచ్చడిని రుచి చూడని తెలుగు ప్రజలు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఉగాది సందర్భంగా గురువారం విశ్వావసు నామ సంవత్సరం నుంచి పరాభవ నామ సంవత్సరంలోకి ఆడుగుపెడుతున్నాం.
సందడే సందడి
శశిర రుతువు ఆకులు రాలే కాలం. తర్వాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. ఉగాది నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండగ సందడి సందడి గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఉగాదికి ఇళ్లను శుభ్రం చేసుకుని, ఇంటి వాకిళ్లను రంగవల్లులతో అలంకరిస్తారు. గుమ్మాలకు మామిడి తోరణాలు కడతారు. ఇంటిల్లిపాదీ కొత్త దుస్తులు ధరించి నిండుదనాన్ని తెస్తారు. అనంతరం ఆలయాలను సందర్శిస్తారు. ఏడాది పొడవునా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, తలపెట్టిన పనులన్నీ సజావుగా పూర్తి కావాలని తమ ఇష్టదైవాలను కొలుస్తారు. ముందుగా ఉగాది పచ్చడి తింటారు.
తీపి, చేదుల కలబోత
ఉగాది పేరు తలవగానే టక్కున గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఆరు రుచుల కలయికతో ఉండే పచ్చడి తెలుగు వారందరికీ ఎంతో ప్రత్యేకం. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు, మంచి చెడులకు సూచికగా తీపి, కారం, పులుపు, చేదు, వగరు, ఉప్పుతో ఈ పచ్చడిని తయారు చేస్తారు. ఉగాది రోజు పంచాంగ పఠనం నిర్వహించడం ఓ ప్రత్యేకత. తెలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పండితులతో పలు సంస్థలు, దేవస్థానాలు, పంచాంగ పఠనం నిర్వహిస్తాయి. అలాగే గ్రామ దేవతల తీర్థాలను కూడా ఈ రోజే నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన అమ్మవార్లు, గ్రామ దేవతల ఉత్సవాలు, తీర్థాలు జరుగుతాయి.
·˘ ¯ólsìæ ¯]l$…_
పరాభవ నామ సంవత్సరం
·˘ BÆý‡$ Æý‡$^èl$ÌS ÝëÓVýS™èl…
·˘ EV>¨ Ðólyýl$-MýS-ÌSMýS$ çÜÆý‡Ó… íܧýl®…
మన సంప్రదాయం
రుతువులను అనుసరించి ఈ ఏడాది పరాభవ నామ సంవత్సరం. ఇది తెలుగు వారి మొదటి పండగ. నేటి నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఉగాది రోజు పంచాంగ శ్రవణం వల్ల మహా ఫలితం కలుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట, సుఖాలకు ప్రతీకగా, తీపి, చేదుల కలబోత అయిన ఉగాది పచ్చడిని స్వీకరించడం సంప్రదాయంగా వచ్చింది.
– బిక్కవోలు అనంత లక్ష్మణ కుమారాచార్యులు,
వేద పండితుడు, కొత్తపేట
ఉగాది శుభాకాంక్షలు
ఉగాది పండగ ప్రతి ఇంటా సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలగజేయాలి. పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. కొత్త ఏడాది ప్రజలందరికీ ఆరోగ్యం, అభివృద్ధి, ఆనందం పంచాలి, తలపెట్టిన ప్రతి కార్యంలోనూ విజయం వరించాలి.
– చిర్ల జగ్గిరెడ్డి,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు


