అమలాపురం టౌన్: అమలాపురం వేంకటేశ్వరస్వామి దేవస్థానంలోని హుండీలను బుధవారం దేవదాయశాఖ తనిఖీదారు జె.రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో తెరచి లెక్కించారు. 45 రోజులకు రూ.9.48 లక్షలు వచ్చిందని దేవస్థానం ఈవో పీవీవీ సత్యకుమార్ తెలిపారు. లెక్కింపులో దేవస్థానం చైర్మన్ కంచిపల్లి అబ్బు లు, ప్రధాన అర్చకుడు పెద్దింటి లక్ష్మీ నరసింహాచార్యులు, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు
ముమ్మిడివరం: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ మేరకు బుధవారం 108 కేంద్రాల్లో జరిగిన హిందీ పరీక్షకు 19,152 మంది విద్యార్థులు హాజరయ్యారు. 44 మంది పరీక్షలు రాయలేదు. డీఈఓ పి.నాగేశ్వరరావుతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, సిట్టింగ్ స్క్వాడ్‌లు అన్ని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయి.


