అమలాపురం టౌన్/కాట్రేనికోన/ముమ్మిడివరం/: ఉగాది సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రస్థాయి పురస్కారాలకు జిల్లాలోని పలువురు ఎంపికయ్యారు. విజయవాడలో గురువారం జరిగే ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా వీరు అవార్డులు అందుకోనున్నారు. పురస్కారానికి ఎంపికై న వారిలో అమలాపురానికి చెందిన సాహితీవేత్త, కవి, రచయిత నల్లా నరసింహమూర్తి, కాట్రేనికోన మండలానికి చెందిన చిత్ర కారుడు ఆకొండి అంజి, ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామానికి చెందిన ప్రముఖ శిల్పి పెద్దిరెడ్డి వెంకట కృష్ణ మాధవరావు తదితరులు ఉన్నారు.


