దేవరపల్లి: ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది నిర్మలగిరి పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలోని మేరీమాతను నిత్య నిష్కళంక మాతగా అన్ని మతాల వారు ఆరాధిస్తున్నారు. ఈ నెల 22 నుంచి 25 వరకు మేరీ మాత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏలూరు పీఠాధిపతి జయరావు పొలిమెర పర్యవేక్షణలో పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఫాదర్ ఎస్.జాన్‌పీటర్, ఉత్సవాల నిర్వహణ కమిటీ, సహాయక ఫాదర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలం గౌరీపట్నం గ్రామానికి ఆనుకుని ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రం ఆవిర్భావానికి 1978లో అప్పటి ఏలూరు పీఠాధిపతి జాన్ ములగాడ నాంది పలకగా పలువురు ఫాదర్లు పుణ్యక్షేత్రం అభివృద్ధికి పాటుపడ్డారు. ప్రస్తుత డైరెక్టర్ ఫాదర్ జాన్ పీటర్ పుణ్యక్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కులమతాలకు అతీతంగా భక్తులు మేరీమాతను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తమ కొర్కెలను మరియతల్లికి విన్నవించుకుంటారు.
1976లో ఏలూరు క్యాథలిక్ పీఠం ఏర్పడింది. అప్పటికే ఏలూరులో బిషప్‌గా ఉన్న జాన్ ములగాడ 1978లో గౌరీపట్నంలో నిర్మలగిరి క్షేత్రాన్ని నిర్మించాలని సంకల్పించారు. అనంతరం ఆయన కారులో విశాఖపట్నం వెళ్తూ గౌరీపట్నం వద్ద కారు మరమ్మతులకు గురవడంతో అక్కడ దిగి ఆ పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు. ఎత్తైన కొండలు, కారుచీకటి, ముళ్లపొదలతో నిండి ఉన్న చిట్టడవి. భయంకర వాతావరణం. అంతలోనే ఆయన మనసులో ఈ ప్రాంతంలో ఆలయం నిర్మించవా అంటూ ప్రేరణ కలిగింది. కారు మరమ్మతులు చేయించుకుని విశాఖకు బయలుదేరారు. గౌరీపట్నం ప్రాంతంలో మేరీమాత ఆలయం నిర్మాణానికి సంకల్పించి 1979లో ఆలయాన్ని నిర్మించి ఫాదర్ మైకేల్‌ను తొలి డైరెక్టర్‌గా నియమించారు. 1982 నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 1992లో ఫాదర్ దిరిసిన ఆరోన్ పుణ్యక్షేత్రం డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1995లో అక్కడ ప్రేమసేవా ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు.
25న పీఠాధిపతుల రాక
ఈ నెల 25న ఉత్సవాల ముగింపు సందర్భంగా ఏలూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర, శ్రీకాకుళం పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ విజయకుమార్ రాయరాల, ఖమ్మం పీఠాధిపతి ప్రకాష్ సంగిలి ఉత్సవాలకు హాజరై సమష్టి దివ్యబలి పూజ నిర్వహిస్తారని జాన్ పీటర్ తెలిపారు.
నిత్య అన్నదానం
పుణ్యక్షేత్రానికి నిరంతరం వస్తున్న భక్తులకు దాతలు, భక్తుల సహకారంతో నిత్యం సుమారు 2 వేల మందికి ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమం కాంట్రాక్టర్ కళ్లే నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరుగుతుంది.
సీసీ కెమెరాల ఏర్పాటు
ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు వస్తున్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాలు, తాగునీరు, భోజన సదుపాయం, విశ్రాంతి పందిళ్లు ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రజా రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడపనుంది. సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారు జాము 3 గంటల వరకు భక్తులు పుణ్యక్షేత్రానికి తరలి వస్తారు.
భారీగా రానున్న భక్తులు
ఉత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఒడిశా, కేరళ రాష్ట్రాల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. కొబ్బరి కాయలు కొట్టడం, తలనీలాలు ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకత.
దీపకాంతుల నడుమ క్రీస్తు శిలువ
గౌరీపట్నం నిర్మలగిరి పుణ్యక్షేత్రంలోని అఖండ దేవాలయం
2000లో
అఖండ దేవాలయ నిర్మాణం
క్షేత్రంలో అఖండ దేవాలయం నిర్మాణానికి 1992లో శంకుస్థాపన చేశారు. 2000లో అప్పటి పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ దిరిసిన ఆరోన్ ఆలయ నిరా్మాణాన్ని పూర్తి చేశారు. ఒకేసారి దాదాపు 5 వేల మంది ప్రార్థనలు చేసుకునేందురు వీలుగా దేవాలయాన్ని నిర్మించారు. క్షేత్రంలో పలు కట్టడాలను కళాత్మకంగా రూపొందించారు.
వంద అడుగుల క్రీస్తు మందిరం
నిర్మలగిరి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పుణ్యక్షేత్రానికి ఎదురుగా సుమారు 100 అడుగుల ఎత్తున సుందరమైన క్రీస్తు మందిరాన్ని నిర్మించారు. చరిత్రలోని వివిధ ఘట్టాలను కళాత్మకంగా గోపురంలో పొందుపరిచారు.
22 నుంచి మరియతల్లి పండగ
ముస్తాబైన పుణ్యక్షేత్రం
అగ్ర పీఠాధిపతుల రాక
10 లక్షల మంది వస్తారని అంచనా
వివిధ ప్రాంతాల నుంచి
{ç³™ólÅMýS BÈtïÜ ºçÜ$ÞË$ ˘


