విద్యుత్‌ స్తంభం పడి సైక్లిస్టు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ స్తంభం పడి సైక్లిస్టు మృతి

Feb 26 2026 7:32 AM | Updated on Feb 26 2026 7:32 AM

విద్య

విద్యుత్‌ స్తంభం పడి సైక్లిస్టు మృతి

మామిడికుదురు: మండలం పెదపట్నంలంకలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిపై విద్యుత్‌ స్తంభం విరిగి పడి అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తి తృటిలో తప్పించుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో కుల వృత్తి చేసుకునే మానేపల్లి శ్రీమన్నారాయణ (65) రెండు వివాహాల నిమిత్తం అవిరేడు కుండలు ఇచ్చి సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా గిడుగువారిపాలెంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న కొబ్బరి చెట్టు విద్యుత్‌ తీగలపై పడింది. దీంతో విద్యుత్‌ తీగలు తెగిపడి ట్రాన్స్‌ఫార్మర్‌తో సహా స్తంభం విరిగి శ్రీమన్నారాయణపై పడింది. దీంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడే ఉన్న మరొక వ్యక్తి గొల్లమందల నాగరాజు పరుగులు పెట్టడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని శ్రీమన్నారాయణ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని కుమారుడు దుర్గాప్రసాద్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

విద్యుత్‌ షాక్‌తో..

అంబాజీపేట: కొబ్బరికాయల దింపునకు కొబ్బరి చెట్టు ఎక్కుతుండగా విద్యుదాఘాతానికి గురై కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నందంపూడి గ్రామానికి చెందిన నేదునూరి జనార్దనరావు (55) బుధవారం కొబ్బరికాయలు దింపు తీసేందుకు చెట్టు ఎక్కుతున్నాడు. కొబ్బరిచెట్టుకు సమీపంలో విద్యుత్‌ వైర్లపై ఉన్న ఎండు కొబ్బరాకు అతడికి తగలడంతో విద్యుత్‌ షాక్‌కు గురై చెట్టుపైనే విగతజీవిగా వేలాడిపోయాడు. జనార్దనరావుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

రిజర్వాయర్‌లో మునిగి..

గంగవరం: వృద్ధురాలు సూరంపాలెం రిజర్వాయర్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయింది. ఎస్సై వెంకయ్య బుధవారం రాత్రి తెలిపిన వివరాల మేరకు మండలం మొల్లేరు గ్రామానికి చెందిన చొప్పా కృష్ణవేణి (70) చిన్నతనం నుంచి మతి స్థిమితం లేక పలు చోట్లకు నడిచి వెళ్లిపోతూ ఉండేది. ఈ నేపథ్యంలో ఆమె సూరంపాలెం రిజర్వాయర్‌ నీటిలో మునిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. బుధవారం సాయంత్రం ఆమె మృతదేహం తేలినట్లు గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నట్టు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని బయటకు తీయించి ఆమెను గుర్తించి మొల్లేరు గ్రామస్తురాలిగా నిర్ధారించామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

విద్యుత్‌ స్తంభం పడి  సైక్లిస్టు మృతి 1
1/1

విద్యుత్‌ స్తంభం పడి సైక్లిస్టు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement